తప్పని పరిస్థితుల్లో పవన్‌తో మహేష్‌ ఢీ?

0
98

Posted April 27, 2017 at 13:07

mahesh spyder movie pawan kalyan trivikram movie release on august
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, తమిళ సూపర్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్‌’. ఈ సినిమాను మొన్నటి వరకు జూన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల రెండు నెలలు ఆలస్యంగా నడుస్తుంది. జులై వరకు షూటింగ్‌ కార్యక్రమాలుండే అవకాశాలున్నాయి. దాంతో సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మెవడాల్సి ఉంది.

జూన్‌లో ‘స్పైడర్‌’ స్థానంను అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రం ఆక్రమించిన విషయం తెల్సిందే. ఇప్పుడు స్పైడర్‌ చిత్రాన్ని మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు 9న విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే నెలలో పవన్‌, కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాను కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరుసగా సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రోజుకు 12 గంటలు కష్టపడుతూ ఆ సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆగస్టు 9న ‘స్పైడర్‌’ విడుదల కానున్న నేపథ్యంలో వారం లేదా రెండు వారాల గ్యాప్‌లో పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటడం ఖాయం అని తెలుస్తోంది.