డైరక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన మహేష్..!

Posted December 2, 2016

Image result for mahesh

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా ప్రస్తుతం అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ 50 శాతానికి పైగా కావొస్తున్నా ఇంకా టైటిల్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఏవేవో టైటిల్స్ అనుకొని చివరకు అభిమన్యుడు, ఏజెంట్ శివ ఫైనల్ చేశారని అన్నారు. అయితే మహేష్ మాత్రం టైటిల్ లో శివ ఉండాల్సిందే అని పట్టుపడుతున్నాడట. అంతేకాదు సినిమా మీద వస్తున్న నెగటివ్ రూమర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డైరక్టర్ కు వార్నింగ్ ఇచ్చాడట.

సినిమా స్టార్ట్ అయ్యి చాలా రోజులవుతున్నా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అదే టైటిల్, టీజర్ ఫస్ట్ లుక్ ఇలా దేన్ని రిలీజ్ చేయకుండా కేర్ తీసుకుంటున్నా అది వేరే విధంగా ప్రేక్షకులు అర్ధం చేసుకుంటున్నారు. దసరా దీపావళికి ఫ్యాన్స్ ను నిరాశ పరచిన మహేష్ రానున్న క్రిస్ మస్, న్యూ ఇయర్ కు కూడా ఎలాంటి గిఫ్ట్ లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.

సినిమా టీజర్ కోసం ప్రత్యేకంగా ఓ 10 సెకన్ల ప్రోమో కట్ చేస్తున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి దాకా టీజర్ కాదు కదా ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయలేదు. ఈ కారణాలన్ని ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ చేస్తుండటంతో మహేష్ మురుగదాస్ తో కలిసి డిస్కస్ చేసి సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడారట. మహేష్ మాత్రం టైటిల్ శివ అని పెట్టినా సరిపోతుంది అని అంటున్నాడట. మరి శివ అంటే నాగార్జున వర్మల సూపర్ హిట్ సినిమా గుర్తుకొస్తుంది. మరి ఆ టైటిల్ పెడితే నాగ ఎలా స్పందిస్తాడో చూడాలి.