మహేష్ భార్య రీ ఎంట్రీ కన్ఫామ్..!!

Posted February 11, 2017

mahesh wife namratha re entry in moviesరీ ఎంట్రీ… ఇప్పుడు ఈ పదం చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లు కొందరు పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయారు. కొంతకాలం తర్వాత ఆ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చి ఫెర్ఫామెన్స్ ఉన్న రోల్స్ లో నటించి మెప్పిస్తున్నారు. తాజాగా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి నిర్ణయించుకుందట.

ఒకప్పటి మిస్ ఇండియా నమ్రత.. మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పింది. మహేష్ కు సంబందించిన వ్యవహారాలూ, ఇతర వ్యాపార విషయాలు, కుటుంబ పరమైన విషయాలను చూసుకుంటూ వచ్చింది. తాజాగా ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యినట్లు తెలుస్తుంది.

హైదరాబాద్‌ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న నమ్రత తన  రీ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది. త్వరలోనే ఓ మల్టి స్టారర్ చిత్రం లో నటిస్తున్నాని తెలిపింది. అయితే అది ఏ భాషలో రూపొందనుందో అలాగే ఆ సినిమాలో ఏ హీరో నటించున్నాడో చెప్పడానికి మాత్రం నిరాకరించింది. ఇది విన్న కొంతమంది అభిమానులు వారి ఊహలకు పదునుపెట్టారు. ఈ వయసులో నమ్రతకు హీరోయిన్ రోల్స్ ఇవ్వరు కాబట్టి.. హీరోకో, హీరోయిన్ కో వదినగానో, అక్కగానో కన్పిస్తుందని చెప్పుకుంటున్నారు. మరి నమ్రత ఏ రోల్ ని సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి.