ఒక మంత్రి …మూడు మాటలు

    manikyala rao said 3 different words
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ముక్కుసూటి మనిషని పేరుంది.బాబు సర్కార్ లో మంత్రిగా వున్నా బీజేపీ ముద్ర కనిపించేలా పనిచేసేందుకు అయన ప్రయత్నిస్తారు .ఈ విధానంలో దేశం నేతలు చాలా మంది అయన మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేసిన ఘటనలున్నాయి .తాజాగా అయన సున్నితమైన అంశాల్లో మాట్లాడిన మాటలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి .

బీజేపీ ని టార్గెట్ చేస్తూ కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ఆంధ్రుల ఆత్మ గౌరవ సభకి వ్యక్తిగతంగా మద్దతిస్తానని మాణిక్యాలరావు అన్నారు.బీజేపీ లైన్ ఎప్పుడు దాటని మంత్రి ఇలా మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది . .ఇక కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ముద్రగడ వైఖరి మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు .ప్రతిపక్ష నేత జగన్ ని ఉద్దేశించి కూడా అయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు .జగన్ ప్రజలకి పనికొచ్చే మంచి సలహాలిస్తే ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తామన్నారు.సైలెంట్ గా వుండే మంత్రి గారు ఒకే సారి ఇన్ని వివాదాస్పద అంశాల జోలికెళ్లడం కమలదళాన్ని సైతం ఆశ్చర్యంలో పడేసింది .