ఏపీ మంత్రి కి ‘గాలి’ చిక్కులు…

Posted November 25, 2016

manikyala rao went to gali home for giving blessings gali daughterఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కర్ణాటకలోని బళ్లారికి గతవారం వెళ్లారు. ఎప్పుడో రెండునెలల క్రితం ఈ కార్యక్రమం ఖరారయ్యింది. బళ్లారిలో కార్యక్రమానికి హాజరై సాయంత్రం రైలుకు బయలుదేరబోయే సమయానికి మాణిక్యాలరావు బళ్లారి వచ్చిన సంగతి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు, అక్కడి ఎంపీ రాములుకు తెలిసిపోయింది. “అన్నా.. బళ్లారి వచ్చి మా ఇంటికి రాకుండా ఎలా వెళతారు..? వచ్చి టీ తాగి వెళ్లండి” అంటూ ఎంపీ రాములు మంత్రి మాణిక్యాలరావుకు ఫోన్‌చేశాడు. ఆ వెంటనే మాణిక్యాలరావు బసచేసిన అతిథిగృహానికి వచ్చి వాలిపోయాడు రాములు ఇంట ఆయన తేనీరు సేవిస్తుండగానే అక్కడకు మైనింగ్‌డాన్‌ గాలి జనార్ధనరెడ్డి చేరుకున్నారు. అనుకోని ఈ పరిణామానికి మంత్రి మాణిక్యాలరావు ఆశ్చర్యపోయారు. ఇక్కడే ఓ ట్విస్టు కూడా చోటుచేసుకుంది.

గాలి జనార్ధనరెడ్డి తన ఇంటికి వచ్చి కుమార్తెను ఆశీర్వదించమని మంత్రి మాణిక్యాలరావును కోరారు. తను వెళ్లాల్సిన రైలుకి సమయమవుతోందని చెప్పినప్పటికీ గాలి జనార్ధనరెడ్డి మాణిక్యాలరావుపై సెంటిమెంటు ప్రయోగించాడట.దీంతో కాదనలేక మంత్రి గాలి ఇంటికి వెళ్లారు. అప్పటికి జనార్ధనరెడ్డి కుమార్తె నిదురపోతోంది. ఆమెను నిదురలేపి రెడీచేసి దేవాదాయమంత్రితో ఆశీర్వచనం ఇప్పించారు.

నెక్స్ట్ రోజునే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి మాణిక్యాలరావు హాజరయ్యారు. క్యాబినెట్‌కు ముందు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో “గాలి ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను మాణిక్యాలరావు ఆశీర్వదించిన విషయం” హాట్ టాపిక్‌గా మారింది. అదేరోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా నుంచి “ఏపీ, కర్ణాటక రాష్ర్టాల పార్టీ నేతలు ఎవరు గాలి జనార్ధనరెడ్డి కుమార్తె వివాహానికి వెళ్లవద్దు” అని మౌఖిక ఆదేశాలందాయి. ఏపీ నుంచి తెలుగుదేశం, బీజేపీ నేతలు ఎవరూ వెళ్లలేదు. పాపం..! దేవదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు మాత్రం మొఖమాటానికి పోయి, సెంటిమెంట్‌కు లొంగి ఈ వివాదంలో చిక్కుకున్నారు. మాణిక్యాల రావు పరిస్థితి ఏమిటో ఇప్పుడు…