పెద్ద నోట్ల రద్దు ఫై “మన్మోహనం”

Posted December 10, 2016

manmohan singh react on currency bannedపెద్ద నోట్ల రద్దు చర్యను మాజీ ప్రధాని,మాజీ ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ మరో సారి ఖండించారు. ప్రధాని మోదీ తొందర పడ్డారేమో అని ఆయన విమర్శించారు. నోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్ రాసిన వ్యాసాన్నిశనివారం ‘ద హిందూ’ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. మన్మోహన్ నోట్ల రద్దు చర్యను అతి పెద్ద విషాద చర్య గా రచించారు .

**నోట్ల రద్దు వల్ల జీడీపీ దెబ్బ తింటున్నదని, ఉద్యోగాల కల్పన తగ్గుతుందన్నారు.

** నోట్ల రద్దు నిర్ణయం భారతీయ వ్యక్తి విశ్వసనీయతకు తీవ్రమైన గాయాన్ని చేస్తుందని.

**నోట్ల రద్దు చర్య వల్ల నల్లధనం ఉన్న వ్యక్తి అతి తక్కువ నష్టంతో బయటపడుతారన్నారు.

**నవంబర్ 24న పార్లమెంట్లోనూ నోట్ల రద్దుపై మాట్లాడిన విషయం తెలిసిందే.

** ప్రధాని మోదీ ఒక్క నిర్ణయంతోనే భారతీయ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారన్నారు. తమను తమ డబ్బును రక్షిస్తుందని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసిస్తారని కానీ ఆ నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు.

**కోట్లాది మంది విశ్వాసం కోల్పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందన్నారు.

** కొత్త కరెన్సీతో ప్రజల సమస్యలను వెంటనే తీర్చలేరన్నారు.

** నల్లధనాన్ని అరికట్టేందుకు తమ దగ్గర వ్యూహాలు ఉన్నాయని మోదీ అనుకుంటున్నారని విమర్శించారు.

**గత ప్రభుత్వాలు నల్ల ధనాన్ని అడ్డుకోలేదన్న విషయంలో వాస్తవం లేదన్నారు. పన్ను ఎగవేతదారులను పట్టుకోవడం ఉగ్రవాదులు వాడే నకిలీ కరెన్సీని రూపుమాపేందుకు నోట్ల రద్దు చర్యను అమలు చేయడం గౌరవ ప్రదంగా భావించవచ్చు