మోడీతో విభేదించిన మ‌నోహ‌ర్ పారిక‌ర్!!

Posted December 26, 2016

manohar parikar about modi demonitization
క్యాష్ లెస్ మంత్రం జ‌పిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి .. తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి వారు కూడా ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నారు. కానీ మోడీ కేబినెట్ లోని స‌హ‌చ‌రులు మాత్రం ఆయ‌న నిర్ణ‌యానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. న‌గదు ర‌హిత లావాదేవీలు సాధ్యం కావంటున్నారు. కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ నోట ఇలాంటి మాట‌లు రావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

త‌న సొంత రాష్ట్రం గోవాలో హండ్రెస్ ప‌ర్సెంట్ న‌గ‌దు ర‌హిత లావాదేవీలు సాధ్యం కావ‌ని మ‌నోహ‌ర్ పారిక‌ర్ చెప్పారు. అస‌లు గోవాను న‌గ‌దు ర‌హిత రాష్ట్రంగా మార్చ‌డం కుద‌ర‌ద‌ని తేల్చిచెప్పారు. కేవలం 50 శాతం వ‌ర‌కు ఓకే గానీ.. మొత్తంగానైతే సాధ్యం కాద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

మ‌నోహ‌ర్ పారిక‌ర్ చెప్పిన దాంట్లో వాస్త‌వం ఉందంటున్నారు గోవా వాసులు. ఎందుకంటే గోవా ప‌ర్యాట‌క రాష్ట్రం. టూరిజం మీదే ఆ రాష్ట్రంలోని వ్యాపారాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. అలాంటిది పూర్తిగా న‌గ‌దు ర‌హితంగా మారిస్తే టూరిస్టుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. ఫ‌లితంగా రాష్ట్రానికొచ్చే ఆదాయం ప‌డిపోతుంది. వ్యాపారాలు దెబ్బ‌తింటాయి. అందుకే పారిక‌ర్ చెప్పింది రైట్ అంటున్నారు చాలామంది.

న‌గదు ర‌హిత లావాదేవీలు మంచివే కానీ .. ఆ మాయ‌లో ప‌డి న‌గ‌దును విస్మ‌రిస్తే న‌ష్టం త‌ప్ప‌దంటున్నారు విశ్లేష‌కులు. మ‌నోహ‌ర్ పారిక‌ర్ మాట‌ల‌తోనైనా మోడీ తేరుకోవాలంటున్నారు. లేక‌పోతే న‌గ‌దు ర‌హితం బెడిసి కొట్ట‌డం ఖాయమంటున్నారు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లోనూ 100 శాతం న‌గ‌దు ర‌హితం సాధ్యం కాదు.