నోట్లరద్దుతో మావోయిస్టుల కొంప కొల్లేరు!!

Posted November 30, 2016

Image result for maoists are surrender to the police station because of currency ban
పెద్ద నోట్ల రద్దు అన్ని వర్గాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మావోయిస్టులు కూడా దీనికి అతీతులు కారు. కరెన్సీ కష్టాల ఎఫెక్ట్ మావోయిస్టు ఉద్యమంపై ఎక్కువగా పడింది. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడం.. ఉన్న పాతనోట్లు చెల్లకపోవడంతో మావోయిస్టుల దినసరి పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారికి నిత్యావసరాలకూ కష్టమైపోయింది. ఆయుధాలు, మందుగుండు, ఆహార పదార్థాల కొనుగోలుకు చేతిలో చిల్లి గవ్వ లేదు. ఉండేది అడవిలో. పూట గడవాలంటే కరెన్సీ కావాల్సిందే. ఈ తరుణంలో ఈ నోటు కష్టాలు పడలేకపోతున్నారు మావోయిస్టులు, వారి సానుభూతి పరులు. ఈ ఆకలి కేకలు తట్టుకోలేక ఏకంగా ఉద్యమానికే గుడ్ బై చెబుతున్నారు.

In Chhattisgarh's Bastar, Former Women Naxals Join Anti-Maoist Operation

గత 28 రోజులుగా దాదాపు 500 మంది మావోయిస్టులు లొంగిపోయారంటే నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఏకంగా దాదాపు 100 మంది మావోయిస్టు సానుభూతిపరులు కూడా పోలీసులకు సరెండర్ అయ్యారు. ఒకనెలలో అత్యధికంగా లొంగుబాట్లు జరగడం ఇదే ప్రథమం. ఇందులో 70 శాతం ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో జరిగనవే కావడం గమనార్హం. 2011 నుంచి ఈనెల 15 వరకు మావోయిస్టుల లొంగుబాట్లను పరిశీలిస్తే.. 3766 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత ఆరేండ్లలో ఈ ఏడాది అత్యధికంగా 1,399 మంది సరెండర్ అయ్యారు. ఇక ఈ నెల రోజుల్లోనే దాదాపు 500 మంది ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

Image result for maoists are surrender to the police station because of currency banపెద్ద నోట్ల రద్దు తర్వాత మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఆర్పీఎఫ్ అధికారులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. వాళ్లకు డబ్బు వెళ్లే మార్గాలను టైట్ చేసి.. నైతికంగా చాలా పెద్ద కొట్టారు. దీంతో ప్రస్తుతం మావోయిస్టుల ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి లొంగిపోవడం.. రెండోది అడవీలోనే ఉండి అన్నీ మౌనంగా భరించడం. ప్రస్తు పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తూ అడవిలోనే జీవించడం కష్టం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పైనా చాలా మంది మొగ్గు చూపారు. ఇంకా చూపుతున్నారు. త్వరలో ఈ లొంగుబాట్లు మరింత పెరిగే అవకాశముంది.