ఆ పెళ్లి ఖర్చు కేవలం 500 రూపాయలేనట…

Posted November 25, 2016

marriage cost only 500 rs in suratగాలి కూతురి పెళ్లి 500 కోట్లు మొన్న, నిన్న యూఏవీ లో కోడలికోసం హెలికాప్టర్ పంపిన మామ , కొత్త నోట్లు ఇస్తే నే పెళ్లి పెళ్లి అని కాన్సల్ చేసుకున్న పెళ్లి ఇలా నోట్ల అడ్డు తర్వాత పెళ్లి కబుర్లు ….కానీ ఈ పెళ్లి కేవలం ఐదువందల ఖర్చు తో చేసారు .

సూరత్‌లోని ఒక కుటుంబం..ఈ పెళ్లి చేసి ఆదర్శం గా  నిలిచింది .నిరాడంబరంగా జరిగిన ఈ వివాహం.. కాబోయే వధూవరులకు ఒక పాఠం.
పెద్దనోట్లు రద్దయినందుకు . ఎవరినీ తిట్టలేదు. ముందుగా నిర్ణయించిన తేదీనే పెళ్లి వేడుకలు నిర్వహించాలని తీర్మానించింది. అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునేందుకు వధూవరులు అంగీకరించారు. పరిమిత సంఖ్యలో అతిథులను పిలిచారు. ఇంట్లోనే పెళ్లి చేశారు. వివాహం, ఏడడుగులు నడవడం అంతా సాంప్రదాయబద్ధంగానే జరిగిపోయింది. వచ్చిన అతిథులకు గ్లాస్ మంచినీళ్లు, కప్పు చాయ్‌తో సరిపెట్టారు. వచ్చినవారు కూడా సంతోషంగా టీ తాగి.. వధూవరులను ఆశీర్వదించి వెళ్లిపోయారు. జస్ట్ ఐదు వందలతో పెళ్లి ఫినిష్ …