సినిమాలు వదిలేసి దేశాలు తిరిగిన హీరో..!

Image result for raviteja

మాస్ మహరాజ్ ఎవరికి అర్ధం కాడు.. ఇదేదో సినిమా డైలాగ్ కాదండి నిజంగానే కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్న ఈ టైంలో విహార యాత్రలంటూ దాదాపు ఈ సంవత్సరం కాలంలో 8 దేశాలను తిరిగి వచ్చాడట. ఈ గ్యాప్ లో 4 సినిమాలను వదిలేసిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరాం, చక్రి, బాబి లాంటి దర్శకులకు హ్యాండ్ ఇచ్చి రవితేజ మాత్రం జాలీ ట్రిప్ వేస్తున్నాడు. ఈ ట్రిప్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసింది ఒక్కసారే. మిగతా అంతా తన పర్సనల్ ఫ్రెండ్స్ తో తిరిగాడట.

సినిమాలను వదిలి మరి ఎంజాయ్ చేయాలని ఎందుకు అనిపించిందో ఏమో కాని ఎప్పుడో సంవత్సరం క్రితం బెంగాల్ టైగర్ గా అభిమానులను అలరించిన రవితేజ తర్వాత సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య బాబి సినిమా ముహుర్తం దాకా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లింది. మరి కమిట్మెంట్ కరెక్ట్ గా లేదా లేక బయటకు వినిపిస్తున్న రెమ్యునరేషన్ వల్లే సినిమాలు ఆగుతున్నాయా తెలియదు కాని రవితేజ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది అన్న శుభవార్త కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.