భరతనాట్యం చేస్తున్న పవన్ కళ్యాణ్ …

 Posted November 6, 2016

maysura reddy about pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కొత్త కాదు.కాకపోతే జనసేన ఏర్పాటు అయ్యాక, పవన్ జనంలోకి వెళ్లడం మొదలెట్టాక ఆ విమర్శల ఘాటు ఇంకాస్త పెరిగింది .తాజాగా ఆ జాబితాలోకి మరో నాయకుడు వచ్చి చేరాడు. ఆయనే సీనియర్ రాజకీయనాయకుడు మైసూరా రెడ్డి. ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ జనసేన గురించి మాట్లాడినప్పుడు అయన వెరైటీ గా స్పందించారు. పవన్ ప్రస్తుతం ఇంట్లోనే భరత నాట్యం చేస్తున్నారని …స్టేజి మీదకి వచ్చి ప్రదర్శన ఇచ్చినపుడే అది బాగుందో లేదో చెప్పగలమని మైసూరా వ్యాఖ్యానించారు.
మరికొన్ని విషయాలపై కూడా మైసూరా భిన్నంగా స్పందించారు.ఓటుకునోటు కేసు నిలబడదన్నారు.చంద్రబాబు ఫోన్ లో నేను డబ్బిస్తా ఓటేయమని అడగలేదుకదా అని అయన ప్రశ్నించారు.రుణమాఫీ విషయంలో వైసీపీ అధినేత జగన్ తమ సలహా పాటించకుండా రెవిన్యూ లోటు అంటూ తప్పు నిర్ణయం తీసుకున్నారని మైసూరా అన్నారు.మొత్తానికి అయన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీ వైపు అడుగులేస్తున్నట్టుంది.అయితే కొడుకు సీటు కోసం అయన ట్రై చేస్తున్నా టీడీపీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.