‘బాహుబలి 2’ను 4 రోజుల తర్వాత చూడాలంటున్న మెగా ఫ్యాన్స్‌

0
136

Posted April 27, 2017 at 18:25

mega fans says in social media bahubali 2 movie watching after four days
‘బాహుబలి 2’ రేపు భారీ ఎత్తున విడుదల కాబోతుంది. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో కర్ణాటకలో విడుదల కానివ్వం అంటూ అక్కడ కొన్ని ప్రజా సంఘాలు అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. అయితే సత్యరాజ్‌ క్షమాపణలు చెప్పడంతో అక్కడ అడ్డంకులు అన్ని తొలగి పోయాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్‌ నుండి ‘బాహుబలి 2’కు ఎదురు దెబ్బ తలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఖైదీ నెం. 150’ మరియు ‘కాటమరాయుడు’, ‘ధృవ’ సినిమాలకు బెన్‌ఫిట్‌ షోలు మరియు ప్రీమియర్‌ షోలకు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆ సినిమాలు సాదారణంగానే విడుదల అయ్యాయి.

ఇప్పుడు బాహుబలి 2 సినిమాకు ప్రీమియర్‌ షోలు, బెన్‌ఫిట్‌ షోలు మరియు రోజుకు అయిదు ఆటలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాల తీరుకు నిరసనగా ‘బాహుబలి 2’ చిత్రాన్ని మెగా ఫ్యాన్స్‌ అతా కూడా మొదటి నాలుగు రోజులు చూడకూడదని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల మెగా ఫ్యాన్స్‌ అంతా కూడా ‘బాహుబలి 2’ను బహిష్కరించాల్సిందిగా సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ పిలుపునిస్తున్నారు. అయితే ఈ పిలుపుకు ఎంత మేరకు స్పందన ఉంంటుందనే చూడాలి. ఇలాంటి సోషల్‌ మీడియా పిలుపులకు ఏ ఒక్కరు కూడా సినిమా చూడకుండా ఆగరు అంటూ స్వయంగా కొందరు మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇదంతా వృద్దా ప్రయాస అంటూ కొందరు మెగా ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు అంటున్నారు.