చిరుని ఇమిటేట్ చేయకుండా హిట్ కొట్టాలి!!

Posted February 2, 2017

mega heros give hit without imitating megastarమెగా కాంపౌండ్ నుండి వచ్చిన  రామ్ చరణ్, అల్లుఅర్జున్, సాయి ధరమ్, వరుణ్ తేజ్ టాలీవుడ్ లో తమ టాలెంట్ ను నిరూపించుకుని ఓ రేంజ్ హిట్ లను కొట్టిన వారే. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న వారే. కాగా  వీళల్లో కొంతమంది చిరంజీవి హిట్ సాంగ్స్ కొన్నింటిని రీమేక్ చేసి వాటిని కూడా సూపర్ హిట్ చేశారు.

మగధీరలో చెర్రీ చేసిన బంగారు కోడిపెట్ట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో సాయి ధరమ్ చేసిన గువ్వా గోరింకతో అనే రీమేక్ పాటలు  సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో చిరు పెద్ద కూతురు ప్రముఖ స్టైలిష్ కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత మరో అడుగు ముందుకేసి, ఒకవేళ రీమేక్‌ చేయాల్సి వస్తే చిరంజీవి నటించిన హిట్ సినిమాల్లో  ఏ మెగా హీరోకు ఏ చిత్రం సెట్‌ అవుతుందని అనే విషయంపై తన అభిప్రాయాన్ని  తెలిపింది. రామ్‌ చరణ్‌కి     జగదేకవీరుడు-అతిలోకసుందరి, అల్లు అర్జున్‌ కి రౌడీ అల్లుడు,సాయిధరమ్‌       కి గ్యాంగ్‌లీడర్‌, వరుణ్‌ తేజ్‌ కి రుద్రవీణ సినిమాలు సెట్ అవుతాయని సుస్మిత చెప్పుకొచ్చింది. ఇక మెగా ప్రిన్సెస్ నిహారిక మాట్లాడుతూ… శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌ లో చిరంజీవి క్యారెక్టర్‌కు తాను సరిపోతానని వెల్లడించింది.  

కాగా ఆల్రెడీ హిట్టైన  సినిమాలను మళ్లీ రీమేక్ చేయడం దేనికని కొంతమంది సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  ఆ సినిమాల్లో చిరు పాత్రలో మరొకరు నటించడం కష్టమని, చిరుని ఇమిటేట్ చేయకుండా ప్రత్యేక సినిమాలు చేసి హిట్ కొట్టాలని సూచిస్తున్నారు.