మెగా మూవీలో భల్లాలదేవుడు

0
111

 Posted May 9, 2017 at 16:46

mega movie in ballalaadheva
‘బాహుబలి’ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్‌కు ఏ స్థాయిలో క్రేజ్‌ దక్కిందే అంతే స్థాయిలో రానాకు కూడా క్రేజ్‌ దక్కింది. రెండు పార్ట్‌లో కూడా రానా అద్బుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రెండవ పార్ట్‌ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసి సంచలనం సృష్టిస్తున్న సమయంలో చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. అలాగే రానాకు కూడా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ సినిమాల్లో కూడా ఛాన్స్‌లు వస్తున్నాయి. తాజాగా రానాకు మెగా మూవీ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది.

మెగాస్టార్‌ 151వ సినిమాగా తెరకెక్కబోతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను బాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న రానాను ఈ సినిమాలో విలన్‌గా తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఉయ్యాలవాడ సినిమాను ప్రమోట్‌ చేసేందుకు వీరిద్దరి సాయం తీసుకునేందుకు నిర్మాత రామ్‌ చరణ్‌ భావిస్తున్నాడు. మెగా ఫ్యామిలీతో ఉన్న సన్నిహిత్యం కారణంగా ఉయ్యాలవాడ సినిమాలో రానా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే అది విలన్‌ పాత్ర అని ఖచ్చితంగా చెప్పడం లేదు. ఆగస్టు నుండి ఉయ్యాలవాడ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతున్న విషయం తెల్సిందే.