‘బాహుబలి 2’పై మెగాస్టార్‌ కామెంట్‌లు

0
106
megastar comments on bahubali 2
 Posted April 30, 2017 at 16:39
megastar comments on bahubali 2టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్ర రెండో పార్టు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలయిన ‘బాహుబలి 2’ చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప పేరు తీసుకువచ్చింది. ‘బాహుబలి 2’ చిత్రాన్ని వీక్షించిన సినీ ప్రముఖులందరూ కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ చిత్రాన్ని పొగిడిన సినీ ప్రముఖులలో తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా చేరిపోయారు. తాజాగా ‘బాహుబలి 2’ చిత్రాన్ని వీక్షించిన చిరు ‘బాహుబలి 2’ చిత్ర యూనిట్‌ను తెగ పొగిడేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళిని ఆకాశానికెత్తేశారు.
 
తాజాగా ‘బాహుబలి 2’ చిత్రంపై స్పందించిన చిరు జయహో రాజమౌళి అంటూ ప్రశంసలు కురిపించాడు. తెలుగు సినీ పరిశ్రమలో చరిత్ర సృష్టించే విధంగా ‘బాహుబలి 2’ని చెక్కాడు శిల్పి రాజమౌళి అంటూ పేర్కోన్నాడు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరిని కూడా అభినందించాడు. ఒకవైపు వారి పని తీరును మెచ్చుకున్న చిరు మరోసారి ‘బాహుబలి 2’ ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపాడు. ‘బాహుబలి 2’ టీమ్‌ను చిరు ఆకాశానికి ఎత్తేశాడు. ఈ చిత్రాన్ని పొగిడిన సినీ ప్రముఖుల జాబితా చాలా పెద్దదిగానే ఉంది. తాజాగా విడుదలయిన ‘బాహుబలి 2’ చరిత్ర సృష్టించేలా విజయాన్ని సొంతం చేసుకుంది.