ఆలూ లేదు సూలు లేదు.. ఎన్టీఆర్‌కు జోడీగా మెహ్రీన్‌

0
83

 Posted April 29, 2017 at 12:18

mehreen kour as heroine in ntr trivikram combination movie
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు జోడీగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందంటూ సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. అయితే ఎన్టీఆర్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమాలో కాదు ఆమె హీరోయిన్‌గా నటించేది, త్వరలో ఎన్టీఆర్‌ నటించబోతున్న త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఎన్టీఆర్‌ జై లవకుశ తప్ప మరే సినిమాను కమిట్‌ అయ్యింది లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాని సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ తర్వాత సినిమా గురించి చాలా ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్‌ తన తర్వాత సినిమాను ఎవరితో చేసే విషయాన్ని ఇప్పటి వరకు ప్రకటించింది లేదు. పవన్‌తో సినిమా పూర్తి అయ్యి, విడుదల అయ్యేందుకు ఎంత లేదన్నా ఇంకా నాలుగు అయిదు నెలలు పడుతుంది. ఆ తర్వాత కొత్త స్క్రిప్ట్‌కు మరియు కొత్త సినిమా ప్రారంభంకు చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. ఆ సినిమాకు సరే ఎన్టీఆర్‌నే హీరోగా అనుకున్నా కూడా ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్‌కు జోడీగా మెహ్రీన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు అనేది పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అయితే మెహ్రీన్‌ ప్రస్తుతం మెగా హీరో ‘జవాన్‌’తో పాటు రవితేజ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో నటిస్తుంది. ఇంత తక్కువ సమయంలోనే ఈమెకు ఎన్టీఆర్‌ వంటి స్టార్‌, త్రివిక్రమ్‌ వంటి సూపర్‌ స్టార్‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు.