కలర్‌ బ్లైండ్ల్‌ వాళ్లకు మైక్రోసాఫ్ట్‌ యాప్‌

Posted November 20, 2016

color-binoculars_hero
కలర్‌ బ్లైండ్‌ ఉన్నవారి వెతలు తీర్చేందుకు మైక్రోసాఫ్ట్‌ కృషి చేస్తుంది. కమర్షియల్‌ అంశాలను పక్కన బెట్టి పూర్తిగా సేవాదృక్పథంతోనే కొత్తగా బైనాక్యులర్స్‌ అనే యాప్‌ని తీసుకొచ్చారు. కొన్ని రంగులను చూడలేనివారికి కలర్‌ బ్లైండ్‌గా గుర్తింస్తారు.. సాధారణంగా ఎరుపు, పచ్చ రంగులు చూడలేనివారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా ఆయా రంగులను గుర్తుపట్టేలా చూపిస్తుంది. మొబైల్‌ కెమెరాను ఉపయోగిస్తూ ఆయా వస్తువులను చూపుతుంది. దాని ద్వారా రంగుల్లో ఉన్న మార్పును సులభంగా గుర్తించొచ్చు. ప్రస్తుతం ఐవోఎస్‌ ఫ్లాట్‌ఫాంపై ఈ యాప్‌ని విడుదల చేశారు. 9.4 ఎంబీ సైజ్‌ ఉంటుంది.. ఐవోఎస్‌ 9 కన్నా పై వర్షన్లలో ఇది పనిచేస్తుంది. ఈ యాప్‌కి మూడు రకాల మోడ్‌లు ఉంటాయి.. రెడ్‌/గ్రీన్‌, గ్రీన్‌/రెడ్‌, బ్లూ/ఎల్లో అనే మూడు రకాల స్విచ్‌లు ఉంటాయి. వాటిని ఉపయోగించేదానిని బట్టి ఫలితాలు మారుతూ ఉంటుంది. త్వరలో ఆండ్రాయిడ్‌లోనూ దీనిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.