వీళ్ళు మగవాళ్లా ,ఆడింగలవాళ్లా…రోజా

Posted February 11, 2017

mla roja arrested in gannavaram airport
వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి వార్తల్లో నిలిచారు.అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గోడానికి ఆమె ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఎయిర్ పోర్ట్ లోనే రోజాని పోలీసులు అడ్డుకున్నారు.దలైలామా వెళ్తున్నందున కాసేపు ఆగాలని లాంజ్ లోనే చాలా సేపు ఆమెని ఆపారు.దీంతో ఆగ్రహించిన రోజా పోలీస్ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. సదస్సుకి ఆహ్వానం పలికి మరీ తనను అడ్డుకోవడమేంటని ఆమె నిలదీశారు.ఆ తర్వాత ఆమెని పోలీస్ వాహనంలోనే గుంటూరు,అద్దంకి మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు.

ఇలా జరగడానికి కారణం ఏంటనేది పోలీసులు చెప్పకపోయినా ….సదస్సులో ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి రసాభాసగా చేయాలని వైసీపీ భావిస్తోందని వచ్చిన సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై రోజా ఘాటుగా స్పందించారు.వెళ్తున్న కార్ నుంచే తన స్పందన తెలియజేస్తూ సెల్ ఫోన్ ద్వారా వీడియోలు తీసిపంపారు.అందులో స్పీకర్ కోడెల వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావించారు.ఇక తనను ఇలా అడ్డుకునే వాళ్ళు మగవాళ్ళు కాదు ఆడంగిలి వాళ్ళని తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు.ఆ వీడియో దృశ్యాలు మీకోసం..