ఫ్రెండ్ షిప్ బ్యాండ్ టైట్ చేస్తున్న మోడీ …

Posted November 23, 2016

modi changed the his attitude
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ రూటు మార్చారు. ఇన్నాళ్లూ మిత్ర‌ప‌క్షాల‌ను లైట్ తీసుకున్న మోడీ సారు.. ఇక దోస్తీ బాట ప‌ట్టారు. తాను ప్ర‌ధాని అయ్యాక తీసుకున్న ఎన్నో నిర్ణ‌యాల్లో ఆయ‌న ఎన్డీలోని ఇత‌ర పార్టీల‌ను సంప్ర‌దించ‌లేదు. క‌నీసం మాట‌మాత్ర‌మైనా చెప్ప‌కుండానే ప‌ని కానిచ్చేశారు. మొన్న‌టి స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ వ‌ర‌కు కూడా అదే ఫాలో అయ్యారు. కానీ పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో ఆయ‌న తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యం మాత్రం విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. ప్ర‌తిప‌క్షాలతో పాటు మిత్ర‌ప‌క్షాలు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుండ‌డంతో సారుకు సీన్ అర్థ‌మైంది. టైమ్ తిర‌గ‌బెట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంది కాబ‌ట్టే ఇక ఎన్డీఏలోని పార్టీల‌ను దువ్వే ప‌నిలో ప‌డ్డారు. ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ను టైట్ చేయాలని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే శివ‌సేనకు గాల‌మేశారు. బాల‌థాక‌రేను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం ద్వారా ఆ పార్టీని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అందులో కొంత‌మేర స‌క్సెస్ కూడా అయ్యారు.

modi praising to shiv sena leader bal thackerayశివ‌సేన త‌ర్వాత పీఎం మోడీ ప్ర‌యారిటీలో ఉన్న పార్టీ టీడీపీ. ఎన్డీఏ కూట‌మిలో ప్ర‌ధాన పార్టీగా ఉన్న టీడీపీని.. మోడీ సారు ఇప్ప‌టిదాకా పెద్ద‌గా లెక్క చేయ‌లేదు. కానీ ఇప్పుడు త‌న‌కు వాళ్ల అవ‌స‌రముంది కాబ‌ట్టి కొంత దిగొచ్చారు. అందుకే ఇప్ప‌టిదాకా ప్ర‌త్యేక ప్యాకేజీ అంశం మాట ఎత్తని ప్ర‌ధాని వారు.. ఇప్పుడు దాన్ని లేవ‌నెత్తే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అంతేకాదు అవ‌స‌ర‌మైతే చ‌ట్ట‌బ‌ద్ధ‌త కూడా ఇచ్చేస్తానంటూ సంకేతాలిస్తున్నార‌ట‌. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని క‌లిసిన త‌ర్వాత సుజ‌నా చౌద‌రి ఇదే విష‌యం చెప్ప‌డం గ‌మ‌నార్హం . అదే జ‌రిగితే ఏపీ ద‌శ తిరిగిన‌ట్టే. ఏదేమైనా మోడీ కౌగిలింత‌లతో … ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌శ తిరిగితే అంత‌కంటే కావాల్సిందేముంది అంటున్నారు టీడీపీ నాయ‌కులు. మొత్తానికి ప్ర‌ధాని నిజంగానే ప్ర‌త్యేక హోదాకు ప్రాణం పోస్తారా.. లేక ఇప్ప‌టిలాగే నాన్చుతారా.. అన్న‌ది త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

modi giving to ap judicial security for special package