మోడీకి శృంగార మాత్ర మద్దతు..

Posted December 1, 2016

Image result for modi support stay on add
స్టే ఆన్ పేరుతో వస్తున్న శృంగార ఉద్దీపన మాత్రల కంపెనీ ఓ ప్రకటన ఇస్తే ఎలా ఉంటుంది? సహజంగా లైంగిక అంశాల ప్రస్తావన ఉండాలి.కానీ ఆ కంపెనీ ఓ మ్యాజిక్ చేసింది.పెద్ద నోట్ల రద్దు గురించి మోడీ తీసుకున్న నిర్ణయాన్ని…ప్రణయ ప్రయాణాన్ని అనుసంధానం చేస్తూ పత్రికల్లో ఇచ్చిన ప్రకటన సంచలనం రేపుతోంది.ఆ ప్రకటన తెలుగు అనువాదం మీకోసం..నోట్ల రద్దు గురించి ఆలోచించేటపుడు నిలకడగా ఉండటం గురించి ఆలోచించండి ..ఇది చేదు మాత్ర కాదు ..శక్తినిచ్చే మాత్ర ధైర్యంగా నిర్ణయం తీసుకున్న నాయకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు శక్తివంచన లేకుండా ఆ నిర్ణయాన్ని సమర్దించండి .ఈ మార్పు మీరు కోరుకున్నది..దాన్ని ఉత్సాహంగా ఆహ్వానించండి.60 ఏళ్లుగా ఏ ఆశ లేకుండానే ఎదురు చూశారు.

ఇప్పుడు కొద్దిపాటి ఇబ్బంది తప్పడంలేదు.గొణుక్కోవడం..మొరపెట్టుకోవడం వద్దు.వేచి వుండండి.ఇది త్యాగం కాదు..ఇది మీ విధి..దేశ నిర్మాణం దిశగా ఇది మీ నిబద్ధత .నవ్వుతూ..శక్తివంతంగా..తేజంతో..ఓజంతో ప్రదర్శన చేయండి.వేచి వుండండి ..భారత్ అజేయశక్తిగా ఎదగడాన్ని గర్వంగా చూడండి.ఇక్కడే వేచి వుండండి ………ఇలా సాగిన శృంగార మాత్ర ప్రకటన మోడీని సమర్ధించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ఆ కంపెనీ అనుకున్నట్టే ఆ మాత్ర బ్రాండ్ కూడా జనాల్లోకి దూసుకెళ్లింది.ఒక్క దెబ్బతో స్వామి కార్యం స్వకార్యం పూర్తి అయింది.