సెక్స్ వర్కర్ల మనసు దోచిన చాయ్ వాలా మోడీ …

Posted December 2, 2016

narendra-modi-and-bhutan-gaffeప్రధాన మంత్రి మోడీ సెక్స్ వర్కర్ల మనసు కూడా దోచారు ..అదెలాగంటే దేశం కోసం ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం వల్ల తాత్కాలికం గా తాము ఇబ్బందులు పడినా దేశం బాగుపడటం కోసం తప్పదని అంటున్నారట .తమవంతు కర్తవ్యమ్ గా భావిస్తామని అంటున్నారు సెక్స్ వర్కర్లు మోడీ తీసుకున్న ఈ స్టెప్ ను సమర్ధిస్తాం అంటున్నారు .. కొన్నాళ్లు తాము కష్టపడినా.. పరిస్థితిలో కాస్త మార్పు వస్తుందనిఆశపడుతున్నారు. ‘‘బీదోళ్లకు మంచి చేస్తామని మోదీ చెబుతున్నారు. ఆ మంచి ఏదో మాకూ జరిగితే బాగుండు. ఎన్నాళ్లని.. ఒళ్లమ్ముకుంటాం. పిల్లలు ఎదిగిన తరువాత వారికి ఏం చెబుతాం. సమాజంలో ఛీత్కారాలు.. డాక్టర్ల చుట్టూ తిరగడాలు.. అడుగడుగునా అవమానాలు.. అయినా ఎందుకీ జీవితమంటే పిల్లల మంచి కోసం. ఆ మంచి మాకు దక్కకపోయినా ఫర్వాలేదు.. మా పిల్లలకైనా దక్కుతుందంటే అంతకన్నా ఆనందమేముంటుంది? నల్లధనం బయటపడితే ఎంతో కొంత మేలు జరుగుతుందనే నమ్ముతున్నాం.

నోట్ల రద్దుతో పెద్దల కంటే పేదలే ఎక్కువగా ఇబ్బంది పడినట్లు.. ఈ సమస్యను ఎదుర్కొంటోంది మనుగడ కోసం పోరాటం చేసే సాధారణ సెక్స్‌ వర్కర్లే.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో దాదాపు 25 వేల మంది వరకూ సెక్స్‌ వర్కర్లు ఉన్నారు. వారిలో అధికశాతం.. కష్టాలతో కాపురం చేస్తున్నామంటున్నవారే! అభాగినుల వ్యధ ఇది. ‘‘పది రోజులుగా బేరాల్లేకపోతే ఎలా చచ్చేది. ప్రభుత్వమా మాకు ఉపాధి చూపదు. శాక్స్‌ వాళ్లు వస్తారు.. దందా మానేసి బతకమంటారు. ఎలా బతకాలో మాత్రం చెప్పరు. ఆ ఎన్‌జీవోల వాళ్లు వచ్చినా ఏవో మందులు లాంటివి ఇచ్చి టెస్ట్‌లు చేసి పోతారు. అందరూ మాటలు చెప్పేవాళ్లే కానీ చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అని వారంతా తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు.దేశం కోసం త్యాగం చేస్తాం అంటున్నారు హాట్స్ ఆఫ్ ..