మోడీ ఏడుపు వెనుక ..?

Posted November 22, 2016

modi feeling sad because common people troubles in money changingప్రధానిమోడీ సర్దార్ వల్ల భాయ్ పటేల్ పటేల్ తర్వాత మరో ఉక్కు మనిషి అని చెప్తారు గుజరాత్ ప్రజలు అందుకు తగ్గట్టే ఏ సమస్య వచ్చిన బైట పడడు తొణకడు కానీ ఈ సారి మాత్రం నోట్ల రద్దు బాణం ఎవరికి తగిలిందో తగుల్తుందో అర్ధం కాక అయోమయం లో పడ్డారు గంభీరం గా వుండే మోడీ , దేశాన్ని బ్యాంకుల ముందు నిలబెట్టిన నిర్ణయం తర్వాత 15 రోజుల్లో బహిరంగం గా భావోద్వేగాలు ప్రదర్శించారు అయన కంట్లోచి చుక్క నీరు రాకుండా జాగ్రత్త పడ్డారు. నల్ల కుబేరుల్ని టార్గెట్ చేసిన ఆయన సామాన్య బాధలు చూసి కొంత కలవరం పడిన మాట నిజం అయన సహజ ధోరణికి భిన్నంగ ఉండటమే దీనికి సాక్ష్యం

అధికారం లో కి వచ్చిన తర్వాత మోడీ మార్క్ పథకాలన్నీ దాదాపుగా అమలుచేసే దిశగానే పావులు కదుపుతూ వచ్చారు అయన ..జన్,ధన్ ,స్వచ్ఛ భారత్ ,ఈ మధ్యనే పాకిస్తాన్ సర్జికల్ వార్ ఇవన్నీ మోడీ తీసుకొన్న నిర్ణయాల మానస పుత్రికలు , సరిగ్గా పదిహేను రోజుల క్రితం సఫాయి ని మోడీ మరో సారి ప్రారంభించారు .ఈసారి మాత్రం భారత్ లో నల్ల ధనవంతులనే లక్ష్యం గా చేసుకొని దేశం మొత్తాన్ని పవిత్రం చేయాలనే సంకల్పం తో ఒక్క సరిగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఈ నిర్ణయం తో ప్రతి ఒక్కరు కంగు తిన్నారు. రద్దు అనేసరికి ప్రతిఒక్కరి గుండెలు జారీ పోయాయి.టాక్స్ ఎగవేత దారులను పట్టు కొనేందుకే అని బ్యాంకుల్లో వేసుకొని నగదు మార్చు కోవచ్చు అనే ప్రకటనే సామాన్యుల్లో ఊపిరి పోసింది.

ప్రతి ఒక్కరి నుంచి మోడీ భేష్ అనే ప్రశంస వచ్చినప్పటికీ రోజు లు గడుస్తున్నా కొద్దీ నగదు తీసుకొనేందుకు పడుతున్న పాట్లు కారణంగా జనాల్లో అసహనం పెరిగి అసలెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రత్యామ్నాయం లేకుండ అనే భావన వచ్చేసింది . ఇదిలా ఉంటే ప్రతిపక్షం లో వున్నాం కనుక ప్రతిదీ వ్యతిరేకిస్తాం అనే ధోరణి పార్టీలది . దీంతో మొత్తంగా మోడీ కొంత డిఫన్స్ లో పడ్డారనే చెప్పాలి ,అదొక్కటే కాదు ముందుగా చిన్న నోట్లను విడుదల చేయకుండా రెండువేల నోటుని విడుదల చేసినా ఆశించిన ప్రయోజనం దక్కక పోగా మరింత అప్రతిష్ట మూట కట్టుకున్నట్లయింది .

ఇదిలా ఉండగా తాను తీసుకున్న నిర్ణయం వల్ల కొంత మంది వ్యక్తులు కు నష్టం కలిగి వారి వల్ల ప్రాణ హాని కలిగే పరిస్థితి ఉందని ప్రధాని మీడియా ముందే చెప్పడం, సలహాలిచ్చిన వారే ఎప్పుడు మాట మారుస్తూ ప్రభుత్వాన్ని మోడీని తప్పు పట్టటం, ఇలా చెప్తూ పొతే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు గా తయారైంది ప్రస్తుతం మోడీ పరిస్థితి .

ఎంతటి వారైనా పరిస్థితి కి తలొంచక తప్పదు అన్నట్టు గా మోడీ కూడా నోట్ల రద్దులో తొందరపడ్డానా అనే డైలమాలో వున్నట్టే ముఖ కవళిక చెప్తోంది . పార్టీ సమావేశం లో చెమర్చిన కళ్ళతో మాట్లాడటం ,యాప్ ద్వారా తన నిర్ణయం పట్ల అభిప్రాయం అడగటం ఇవన్నీ చుస్తే అయన మానసిక సంఘర్షణలో ఉన్నారనే చెప్పాలి.