అన్నీ మోడీ చేశాడా.. వీళ్లంతా పత్తిత్తులా..?

Posted April 21, 2017 at 10:46

modi friends said dont blame to pmదేశంలో ఏం జరిగినా మోడీనే అంటున్నారని, ఆయన సన్నిహితులు తెగ బాథపడిపోతున్నారు. ఏదో అవతలివాళ్ల లొసుగుల్ని పట్టుకుని చాణక్యం ప్రదర్శిస్తున్నారే కానీ.. ఆయనెవర్నీ హింసించడం లేదన్నది వారి వాదన. నిజాలు తరచిచూస్తే.. ఈ వాదన కరెక్టుగానే అనిపిస్తోంది. మొదటగా తమిళనాడు బాగోతాన్ని తీసుకుందాం. శశికళ ప్లాన్ ప్రకారం ఒక్కో మెట్టు ఎదిగితే.. పార్టీలో, ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేది కాదు. కానీ జయ మరణ రహస్యం రివీల్ చేయకుండా, ఎవర్నీ లోపలికి అనుమతించకుండా ఆమే రాణిలా చక్రం తిప్పారు. జయలలిత చనిపోయి పట్టుమని పది రోజులు కాకముందే పీఠమెక్కాలని ఆరాటపడ్డారు. ఫలితం అనుభవించారు. ఇందులో మోడీ ఏం చేశారు పాపం. జస్ట్ శశి అసలు స్వరూపాన్ని బయటపెట్టారంతే.

ఇక అద్వానీ విషయానికి వద్దాం. సరైన శిష్యుల్ని తయారుచేసుకోకపోవడం ఆయన తప్పు. అసలు ఆయన హిందుత్వానికి కూడా సవాల్ ఎదురయ్యేలా జిన్నాను పొగడి కోరి కష్టాలు తెచ్చుకున్నారు. అద్వానీ హిందూ ముసుగేసుకున్న పాకిస్థానీ అని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇంత వ్యతిరేకత పెట్టుకుని మోడీ మీద పడి ఏడిస్తే ఏమొస్తుందంటున్నారు ప్రధాని అనుచరులు. పక్కా ప్లాన్ తో మోడీ ఛరిష్మా తెచ్చుకుంటే.. అనాలోచిత నిర్ణయాలతో అద్వానీ ఉన్న ఛరిష్మా పోగొట్టుకున్నారని ఎత్తిచూపుకున్నారు.

ఇక ఏపీకి హోదా విషయానికొద్దాం. ఇక్కడ మాత్రం చంద్రబాబు తనవైన రాజకీయాలు చేశారు. వీలైనంత వరకు హోదా కోసమే ట్రై చేశారు. కానీ కేంద్రం చక్రబంధం ఆయన్న ముందుకు కదలనివ్వలేదు. పొత్తు ఉపసంహరించుకుంటే అసలు నిధులు రావని సర్దుకుపోయారు. ఇక్కడ ఏపీ నిస్సహాయతను మోడీ క్యాష్ చేసుకున్నారంతే. ప్రస్తుతం మోడీ పరిస్థితి చూస్తే అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి. ధోనీ కెప్టెన్ అయిన మొదట్లో కూడా ఇలాగే సుడి తిరిగింది. కానీ ఒక్కసారి సుడి ఆగితే ధోనీ పరిస్థితి ఇప్పుడెలా ఉందో.. రేపు మోడీ పరిస్థితి కూడా ఇదే అని ఆయనకు ఎవరూ చెప్పక్కర్లేదు. ఎందుకంటే మోడీకి ఆ విషయం తెలుసు. అందాకా వస్తే ఏం చేయాలో కూడా తెలుసంటున్నారు అనుచరులు.