న‌ల్ల కుబేరుల‌కు లాస్ట్ ఛాన్స్!!!

Posted November 26, 2016

Image result for modi last chance

బ్లాక్ మ‌నీపై యుద్ధం ప్ర‌క‌టించిన మోడీ స‌ర్కార్…మ‌రింత వేగం పెంచాల‌ని భావిస్తోంది.న‌ల్ల‌కుబేరుల‌కు చాలా అవ‌కాశాలిచ్చినా వాళ్లు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఎంత ఒత్తిడి తెచ్చినా బ్లాక్ మ‌నీ పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. ఇప్పటిదాకా లెక్కల్లో చూపని సొమ్మును 45 శాతం పన్ను చెల్లించి … వైట్ గా మార్చుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ‘ఆదాయ వెల్లడి పథకం’ ద్వారా కల్పించింది. అయినా స‌ద‌రు బ్లాక్ బిలియ‌నీర్స్ స్పందించ‌లేదు. దీంతో ఇంకో ఛాన్స్ ఇచ్చి .. ఆ త‌ర్వాత ప‌నిష్ మెంట్ ను మ‌రింత ఎక్కువ చేయాల‌ని నిర్ణ‌యించింద‌ట మోడీ స‌ర్కార్.

నవంబరు 10 నుంచి డిసెంబరు 30 లోపు న‌ల్ల కుబేరులు జమ చేసే సొమ్ముపై 50 శాతం పన్ను విధించాలనే నిర్ణయానికి వచ్చిందని స‌మాచారం. పన్ను విధించడంతోపాటు ఖాతాల్లో జమ అయిన ఆ సొమ్మును నాలుగేళ్లపాటు విత్ డ్రా చేసే వీలు లేకుండా కట్టడి చేసే అవ‌కాశం కూడా ఉంద‌ట‌. గురువారం రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నార‌ట‌. ఆ మేరకు ఆదాయపన్ను చట్టానికి సవరణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే ఇప్ప‌టిదాకా లెక్క‌ల్లో చూప‌ని సొమ్ముకు 45 శాతంతో పాటు అద‌నంగా ఇప్పుడు 5 శాతం అదనపు పన్నుప‌డుతుంది. ఇప్పుడు కూడా వెల్లడించకుండా నల్లధనం దాచుకున్నవారు పన్ను అధికారులకు దొరికిపోతే మాత్రం శిక్ష భారీగానే ఉంటంది. బ్లాక్ మనీపై 90 శాతం పన్ను, దాంతోపాటు జరిమానా కూడా విధిస్తారని చెబుతున్నారు. ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే దీనికి ఆమోద‌ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

కేంద్రం న‌ల్ల‌కుబేరుల‌కు లాస్ట్ చాన్స్ ఇవ్వ‌డానికి జ‌న్ థ‌న్ ఖాతాల్లో 21 వేల కోట్ల రూపాయ‌లు డిపాజిట్ కావ‌డ‌మే కార‌ణ‌మ‌ట‌. బ్లాక్ మ‌నీ అంతా జ‌న్ థ‌న్ ఖాతాల్లోకి వ‌స్తుంద‌న్న అనుమానాలున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం కొత్త ప్ర‌తిపాద‌న‌న‌కు తెర‌పైతి తీసుకొస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.