మోడీ నెత్తిన కొత్తగా రెండు బండలు..

Posted November 16, 2016

modi have problems to gali daughter wedding and sbi decisions
బ్లాక్ మనీ పేరు చెప్పి పెద్ద నోట్ల రద్దు తో ప్రధాని మోడీకి వచ్చిన పేరుకి sbi తీసుకున్న ఓ నిర్ణయంతో డామేజ్ తప్పేట్టు లేదు.7106 కోట్ల మొండిబకాయిలు రద్దు చేస్తునట్టు sbi చేసిన ప్రకటన మోడీ రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. రద్దైన బకాయిల్లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా ఉండడం తో మోడీ వ్యతిరేకులకు భలే అవకాశం దొరికింది. మాల్యాకి చెందిన 1201కోట్ల రుణాన్ని sbi రద్దు చేసింది.ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ సహా వివిధ పార్టీల నేతలు sbi నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు.

గాలి ఇంటి పెళ్లి వ్యవహారం కూడా మోడీకి తలనొప్పి అయింది.ఆ పెళ్లి ఖర్చు,దానికి బీజేపీ నేతల హాజరు వ్యవహారాన్ని కాంగ్రెస్ ఏకంగా రాజ్య సభలో ప్రస్తావించింది.500 కోట్లు ఖర్చుపెట్టిన పెళ్ళికి బీజేపీ నేత యడ్యూరప్ప హాజరు వంటి అంశాల్ని లేవనెత్తి ప్రధానిని ఇరుకున పెట్టింది.గాలి పెళ్లి ఖర్చుని చూస్తూ ఊరుకున్న మోడీ సర్కార్ ఇంకా బ్లాక్ మనీ మీద యుద్ధమేలా చేస్తుందని కాంగ్రెస్ నిలదీసింది.ఏమైనా ఈ రెండు అంశాలు మోడీ నెత్తిన బండలయ్యాయి.