పెళ్లి చెడినా…. మోడీ కి థాంక్స్

Posted November 24, 2016

modi ji my wedding cancelled thank youమోడీ జి మేరా షాదీ ర ద్ హువా ధన్యవాద్ .అంటూఢిల్లీ కి చెందిన ఓ యువతి థాంక్స్ చెప్పింది ఎదుకంటే ..అడిగినంత కట్నం కావాలట అది కూడా కొత్త నోట్ల తో నే కావాలని పట్టు బట్టిన ఓ వరుడితో ఏకంగా వివాహాన్ని రద్దు చేసుకుంది ఓ యువతి, అదేంటో చూద్దాం రండి … ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తనకెంతో సాయపడిందని.. లేకపోతే డబ్బు కోసం ఆశపడే వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడాల్సి వచ్చేదని ఆ యువతి సంతోషం వ్యక్తం చేసింది.

కవిత అనే యువతి లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఓ కంపెనీ లో సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న విక్కీతో కవిత కు పెళ్లి నిశ్చయమైంది. డిసెంబరు 9న వీరి వివాహం జరగాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దుతో కారు, సామాగ్రి కొని ఇచ్చేందుకు కాస్త సమయం కావాలని వరుడి తల్లిదండ్రులను కోరగా కారు, సామాగ్రి కొనే వరకు పెళ్లివాయిదా వేయాలంటూ వరుడి కుటుంబీకులు పట్టుబట్టారు. దీనికి వధువు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. సరికదా వరుడి కుటుంబీకులు పెళ్లి రద్దు చేసుకున్నారు.

డబ్బు కోసం పెళ్లినే రద్దు చేసుకున్న వ్యక్తి తనకు భర్తగా రాకపోవడమే మంచిదైందని.. ప్రధాని మోదీ నిర్ణయంతో తనకు పరోక్షంగా మంచే జరిగిందని.. ఇందుకు మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని కవిత అంటోంది ..