మోడీ, కేసీఆర్- క్లోజ్ ఫ్రెండ్సా?

Posted November 25, 2016

modi kcr close friends
పెద్ద నోట్ల ర‌ద్దుతో యావ‌త్ దేశం ఆర్థికంగా క‌ష్టాలు ప‌డుతోంది. న‌రేంద్ర‌మోడీపై రోజురోజుకు విమ‌ర్శ‌ల జ‌డివాన పెరుగుతోంది. ఈ స‌మ‌యంలో మొట్ట‌మొద‌ట ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోడీని క‌లిసిన ముఖ్య‌మంత్రి కేసీఆరే. అయితే మోడీ ఆహ్వానం మేర‌కే కేసీఆర్ ఢిల్లీ వెళ్లార‌న్న వాద‌న ఉంది. అయితే ఇందులో వాస్త‌వం ఉందా లేదా.. అన్న‌ది ప‌క్కన బెడితే… మీటింగ్ లో మాత్రం ప్ర‌ధాని మోడీ, సీఎం కేసీఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారట‌. త‌న నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త‌లు వెల్లువెత్తుతున్న త‌రుణంలో కేసీఆర్ నుంచి మ‌ద్దతు రావ‌డాన్ని మోడీ .. చాలా ముఖ్య‌మైన అంశంగా ప‌రిగ‌ణిస్తున్నార‌ట‌. అందుకే ఇక ముందు కేసీఆర్ తో ఫ్రెండ్ షిప్ ను కొన‌సాగించాల‌ని కూడా గ‌ట్టిగా డిసైడైపోయార‌ట‌.

మోడీ నుంచి త‌న‌కు పాజిటివ్ సంకేతాలు రావ‌డంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నార‌ని టాక్. ఇక తెలంగాణకు కేంద్రం నుంచి భారీగా నిధుల రాబోతున్నాయ‌ని స‌న్నిహితుల‌కు చెబుతున్నార‌ని స‌మాచారం. తాను, ప్ర‌ధాని మోడీ జిగ్రీ దోస్తుల‌మైపోయామ‌ని ఢిల్లీ విశేషాల‌ను అంద‌రికీ చెబుతున్నారట‌. ఇదంతా చూస్తుంటే.. ఇక మోడీ, కేసీఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయార‌ని బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.