ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు మోడీ మార్క్ …

Posted November 25, 2016
modi mark from chief minister to prime ministerగుజరాత్ ముఖ్య మంత్రి ఆ తర్వాత దేశ ప్రధాని పదవి నాటి నుంచి నేటి వరకు నరేంద్ర మోడీ మార్క్ రాజకీయం ,చెక్కుచెదరని ఆత్మా విశ్వాసం తో తీసుకున్న నిర్ణయాలు మోడీని ప్రగతి పధం లో నడిపిస్తున్నాయి .కఠిన నిర్ణయాల సమయం లో వ్యతిరేకత పదవి చేజారి పోతుందనే సూచనలు వున్నా అయన నమ్మిన దాని మీద అంట దృఢం గ నిర్ణయం తీసుకొనేవారు,ఇందుకు ఉదాహరణ గుజరాత్ విద్యుత్ సంస్కరణ అంశం .సరిగ్గా ఎన్నికల సమయం లో ఆయన తీసుకొచ్చిన ఈ సంస్కరణ విద్యుత చౌర్యానికి పాల్పడిన రైతులపై పోలీసులు కఠినచర్యలు. ఈ చర్యలు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను సైతం కలవరపరిచాయని చెప్తే నమ్మ లేని నిజాలు .

modi mark from chief minister to prime ministerఅక్కడి రైతులు బీజేపీ అనుబంధ ఆర్ ఎస్ ఎస్ ను వెంట బెట్టుకొని రైతుల ప్రతినిధి బృందం ఒకటి ముఖ్యమంత్రి మోదీని విద్యుత సంస్కరణలు ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడవని ,మీ ఆలోచనను విరమించుకోవాలని విన్నవించారు. ‘ముఖ్యమంత్రి పదవి నుంచి అయినా వైదొలగుతానుగానీ విద్యుత సంస్కరణలపై వెనుదిరిగే ప్రసక్తే లేదని’ ఆయన నిర్ద్వంద్వం వారికీ చెప్పారు .. ‘నా విధానాలు నచ్చకపోతే నన్ను తొలగించి మీరు మరొకరిని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవచ్చని’ కూడా చెప్పేసారు .

modi mark from chief minister to prime ministerడిమోనెటైజేషన్‌ (పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు) కూడా సరిగ్గా ఎలాంటి కోవకే వస్తుందని చెప్పాలి సామాన్యప్రజల సంక్షేమానికే కాక తన రాజకీయ భవితవ్యానికి సైతం చిక్కులను సృష్టించే ఆ నిర్ణయానికి మోడీ ఎందుకు మొగ్గారు ,అయన తెగువ ని చూడాలి అంటే ఖచ్చితం గా అయన గతం లోకి తొంగి చూడక తప్పదు ఎందుకంటె అంతటి తెగువ ఉన్న వ్యక్తి మోడీ . .

ఎటువంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించగలననే నిండు నమ్మకంతోనే, తమ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలనే వివిధ వర్గాల డిమాండ్లనుమోడీ త్రోసిపుచ్చుతారు. బలమూ, బలహీనత రెండూనూ. సంశయం లేకపోవడం వల్లే విపత్కరమైన నిర్ణయాలకు వెనుకాడరు. ఆవేశ పూరిత నిర్ణయాలు తీసుకోవడం కద్దు. కానీ అయన ఆడుతున్న ఆట మాత్రం ఖచ్చితం గ కట్టి మీద సాము లాంటిదే అని చేప్పాలి … కాలం చెప్పే జవాబు కోసం ఎదురు చూడాల్సిందే ..