మోడీ పోలీస్ బుర్ర ..

Posted November 9, 2016

modi police brain
కాకలు తీరిన క్రిమినల్ ని లేదా పెద్ద తలకాయల్ని అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ బుర్ర పలు రకాలుగా ఆలోచిస్తుంది.వాళ్ళు బెయిల్ కోసం వెళ్లకుండా కోర్టు సెలవలప్పుడో …రెండో శనివారం,ఆదివారం కలిసి వచ్చే లాగానో చూసి అరెస్ట్ చేస్తారు.ప్రధాని మోడీ కూడా అలాంటి పోలీస్ ప్లాన్ వేశారు.హఠాత్తుగా అయన నిన్న రాత్రే ఈ ప్రకటన చేయడం వెనుక నల్ల కుబేరుల మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వుంది.వాళ్ళు తేరుకుని ఏదో ఒకటి చేయకుండా సెలవల్ని కూడా ఓ అస్త్రంగా ప్రయోగించారు.అదెలాగో మీరే చూడండి..

500,1000 నోట్ల రద్దు ప్రకటన వచ్చిన వెంటనే 9,10 తేదీలు బ్యాంకు సేవలు నిలిపేశారు.12 వ తేదీ రెండో శనివారం సెలవు..13 వ తేదీ ఆదివారం సెలవు…14 వ తారీఖు నెహ్రు జయంతి సందర్భంగా సెలవు…ఇన్ని రోజులు బడా బాబుల్ని సేవలతో బంధించిన మోడీది పోలీస్ బుర్ర కాదంటారా?