మోడీ మాటలతో ఏపీ బీజేపీ నేతలకి షాక్ ..

0
150

modi-team
ఏపీ కి మంచి ప్యాకేజ్ ఇచ్చాము…అది త్వరగా అభివృద్ధి చెందుతుంది….ఇవీ ప్రధాని మనసులో మాటలు.ప్యాకేజ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుదామని ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలతో ఆయన స్వయంగా చెప్పిన మాటలు.ప్యాకేజ్ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి ప్రయత్నించాలని కూడా మోడీ ఏపీ నేతలకు హితబోధ చేశారు.ఇదే టార్గెట్ గా బీజేపీ కొన్ని బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.అందులో ఒకటి,రెండు సభలకి మోడీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదంతా ఓ లెక్క అయితే ఒకరిద్దరు నేతలు ఏపీ కి మరి కాస్త సాయం చేస్తే బాగుండేదని అన్నప్పుడు మోడీ చూద్దాం అన్నారంట.అంతటితో ఆగకుండా ఏపీ పరిస్థితి బాగానే ఉంటుంది ..విభజన తర్వాత గుజరాత్ ఉప్పు అమ్ముకుని ముందుకెళ్లిందని వ్యాఖ్యానించారట.దీని అర్ధం ఇంకా సాయం చేస్తామనా?చేయమనా? అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు బీజేపీ నేతలు.జైట్లీ మాత్రం మోడీ ఏపీ సభల్లో మరికొన్ని వరాలిస్తారని చెప్పారట.అంతలో మోడీ అర్ధం అయ్యికాకుండా మాట్లాడేసరికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు ఏపీ కమలం నేతలకి.పరిస్థితి చల్లబరిచేందుకు ఓ నాయకుడు విదేశాలు తిరిగి తిరిగి మోడీకి దౌత్య భాష అలవాటైంది అన్నాడంట.