ఢిల్లీలో తమిళనాడు ఫార్ములా?

Posted December 23, 2016

modi want it rides on delhi cm kejriwal like tamil nadu
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాని నరేంద్రమోడీ అంటే అస్సలు పడదు. కాంగ్రెస్ కూడా అంతలా మోడీని విమర్శించలేదేమో కానీ కేజ్రీవాల్ మాత్రం మోడీని ప్రతిరోజు టార్గెట్ చేస్తూనే ఉంటారు. దీంతో మోడీ ఆయనతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడైపోయారట. తమిళనాడు ఫార్ములాను ఢిల్లీలో అప్లయ్ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్.

తమిళనాడును తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ పెద్దలు అక్కడ ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు. అటు చిన్నమ్మను, ఇటు పన్నీర్ సెల్వంను నయానో భయానో తమ గుప్పిట్లోకి తెచ్చేసుకున్నారు. ఇక మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఎపిసోడ్ తో ఇద్దరికీ స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. సరిగ్గా ఇదే ఫార్ములాను ఢిల్లీలో వర్కవుట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట కేంద్ర పెద్దలు. అందులో భాగంగానే తొలి వికెట్ గా నజీబ్ జంగ్ ను బయటకు పంపించారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా నజీబ్ జంగ్ స్వచ్చందంగా తప్పుకున్నారు. కానీ ఆయన తప్పుకునేలా బీజేపీయే ఎత్తుగడ వేసిందని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కమలనాథులు చెప్పినట్టే జంగ్ నడుచుకున్నారని చెబుతున్నారు.

నిజానికి జంగ్ మొదట్లో కేంద్రం నుంచి వచ్చేసిగ్నల్ ఆధారంగా నడుచుకున్నారు. ఒక దశలో కేజ్రీవాల్ ను ఇబ్బంది కూడా పెట్టారు. కానీ ఆ తర్వాత జంగ్ ను కేజ్రీవాల్ దారిలోకి తెచ్చుకున్నారు. జంగ్ సైలైంట్ అయిపోవడంతో ఆయన వెళ్లిపోయేలా ఢిల్లీ పెద్దలే స్కెచ్ వేశారట. అనుకున్నట్టే జరిగి జంగ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. జంగ్ ప్లేసులో మరో బీజేపీ మనిషి రాబోతున్నారట.

ఇక తమిళనాడు తరహాలో ఢిల్లీ స్టేట్ లోనూ ఐటీ రైడ్స్ జరగొచ్చని అనుమానిస్తున్నారు. ముందు ఉన్నతాధికారులను టార్గెట్ చేసి… ఆ తర్వాత కేజ్రీవాల్ దగ్గరకు వస్తారని టాక్. ఈ విషయం ఊహించిన కేజ్రీవాల్ కూడా జాగ్రత్తగా అడుగులేస్తున్నారని సమాచారం.