1000 నోటు పై పక్కా క్లారిటీ ….

Posted December 5, 2016

modi will release new 1000 rs note on december 30కొత్త 5వందల నోటు అక్కడక్కడా కనిపిస్తోంది కానీ వెయ్యి నోటు జాడే లేదు. ఈ వెయ్యి రూపాయల నోటు బ్యాంకుల్లోకి, అక్కడి నుంచి జనం జేబుల్లోకి రావాలంటే కొత్త సంవత్సరం వచ్చే దాకా ఆగక తప్పదట . ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వెయ్యి రూపాయల నోటును ప్రవేశపెడుతున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటిస్తారట, కొత్తగా 20రూపాయలు, 50 రూపాయల నోటును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐయే తెలిపింది. పాత 20, 50 నోట్లు యథాతథంగా ఉంటాయని, వాటికి తోడు కొత్త నోట్లు చలామణీలోకి తేవాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 1000 నోటు మార్కెట్లోకి వస్తే జనం కష్టాలు దాదాపుగా తీరినట్టే .. 1000 నోటు కోసం ఇంకో నెల వెయిట్ చేయాల్సిందే ..