వాళ్ళకీ మోడీ అలవాటు చేశాడు..

Posted November 25, 2016

modis currency ban effect on banking and postal
ఇందుగలడందు లేదని సందేహం వలదు ..ఎందెందు వెదికినా అవినీతిమయం ….ఈ దేశంలో అవినీతి గురించి ఇంతకన్నా ఏమి చెప్పగలం?అయితే అవకాశం లేక కొన్ని రంగాల్లో అవినీతి అంతంత మాత్రమే.వాటిలో పోస్టల్ శాఖ ప్రధానమైనది.ఏదో నామమాత్రపు మామూళ్లు తప్ప భారీ అవినీతి ఆ శాఖలో జరిగేది తక్కువే …అయితే పెద్ద నోట్ల రద్దు పుణ్యమాని పోస్టల్ విభాగంలోనూ భారీ అవినీతి జరిగినట్టు తెలుస్తోంది.ఉన్నతోద్యోగులు కమిషన్ లకి లొంగి బడాబాబుల నోట్లని మార్చారని తెలుస్తోంది .దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా సిబిఐ వివిధ పోస్ట్ ఆఫీస్ ల మీద దాడులు జరిపి కేసులు నమోదు చేసింది.ఇక బ్యాంకింగ్ వ్యవస్థలోనూ ఇదే పరిస్థితి.అంతకు ముందు కన్నా భారీ స్థాయిలో అవినీతి పెరిగిందని అన్ని సర్వే లు చెబుతున్నాయి.ఈ రెండు శాఖల్ని కూడా అమ్యామ్యాల వైపు మళ్లించిన ఘనత మాత్రం మోడిదే ..