ఆ కొత్త జంట ఇంటికి వెళ్లిన మోహన్ బాబు..

   mohan babu going varun sandesh marriageఇటీవలే వరుణ్ సందేశ్ .. వితికా షేరు వివాహ వేడుక జరిగింది. వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మోహన్ బాబుకి మాత్రం కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా ఆ వివాహ వేడుకకి హాజరుకాలేకపోయారు. ఆ తరువాత ఆయన నేరుగా వరుణ్ సందేశ్ ఇంటికి వెళ్లి కొత్త దంపతులకు ఆశీస్సులు అందజేశారు.

మోహన్ బాబు అలా తన ఇంటికి వచ్చి ఆశీస్సులు అందజేయడం పట్ల వరుణ్ సందేశ్ ఆనందంతో పొంగిపోయాడు. మోహన్ బాబు గారి తరగని ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన సంతోషాన్ని ట్వీట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మోహన్ బాబుతో ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ .. ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రాల్లో వరుణ్ సందేశ్ నటించాడు.