నేనా దరి.. నువ్వీ దరి..సినిమా కలిపింది ఇద్దరిని

Posted December 1, 2016

Image result for nikol and uma from kerala

పాత సినిమాలో ఒక పాట ఉండేది గుర్తుందా నువ్ ఈ దరి న నేనా దరి న కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని.అనే డ్యూయెట్ వింటేనే ఎంతో మధురం గా ఉండేది ఆ పాట కాని వీళ్ళ ఆసక్తి సప్త సముద్రాలూ దాటేసింది అందుకే కేరళ అమ్మాయి, అమెరికా అమ్మాయి వీళ్ళ ఇంట్రస్ట్ లు ఒకటి కావడం ఆసక్తి వారిద్దరిని కలిపింది.

న్యూజెర్సీకి చెందిన నికోల్‌ డొనాడియో కొన్నాళ్ల క్రితం ‘వోల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌స్ట్రీట్‌’ చిత్రానికి పేరడీగా ‘వుమెన్‌ ఆఫ్‌ వాల్‌స్ట్రీట్‌’ పేరుతో రెండున్నర నిమిషాల వీడియోను చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టింది. కేరళకు చెందిన ఉమా కుమారపురానికి బాగా నచ్చింది లైక్ చేసింది ఉమ కేరళ సినీ పరిశ్రమలో సినిమాటోగ్రఫీ విభాగంలో పని చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలకు పని చేసింది. కొద్ది రోజులకు నికోల్‌ నుంచి ఉమకు సమాధానం వచ్చింది. అలా మాటలు కలిశాయి వీరిద్దరి మధ్య .ఇద్దరు కలిసి ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేయాలని భావించారు. కానీ కుదర్లేదు. నికోల్‌ ఇండియాకి.. ఉమ అమెరికాకు వెళ్లలేని పరిస్థితి. అయినా ఇద్దరు కలిసి ఓ సినిమా చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉండిపోయింది. ఇద్దరూ తమ ప్రాంతాల్లో షూటింగ్‌ చేసి వాటిని కలిపి సినిమాగా మలచాలని భావించారు.

‘నీలా-హోలీ’ పాత్రలతో కథను సిద్ధం చేశారు. 60 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో రెండు భిన్న దేశాల సంస్కృతులకు చెందిన నీలా.. హోలీల జీవితాలు ఎలా ఉన్నాయి…. వారు కన్న కలల్ని ఎలా సాకారం చేసుకున్నారు… అనే అంశాలను తెరపై చూపబోతున్నారు. సినిమాలో కామెడీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారట. ఇద్దరూ షూటింగ్‌ చేసిన సన్నివేశాల్ని ఆన్‌లైన్‌ ద్వారా ఒకరినొకరికి పంపుకుంటూ చిత్రీకరణ పూర్తి చేద్దామనుకున్నారు. నిర్మాత దొరక్క పోవడం తో విరాళాల ద్వారా సేకరించిన సొమ్ముతో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారట