ఏపీ లో కవితకి జేజేలు..

Posted February 10, 2017

mp kavitha speech in amaravathi to do support to ap special status
జల్లికట్టు ఉద్యమంతో ఉప్పొంగిన ప్రత్యేక హోదా సెంటి మెంట్ ఇప్పుడిప్పుడే చల్లారుతోందని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారు. ఇంతలో ఆ అంశాన్ని మళ్లీ రెచ్చగొట్టేలా ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తాయని లోలోన భయం ఆయనకి లేకపోలేదు.అనుకున్నంతా అయింది.కాకుంటే ఏపీ కి చెందిన రాజకీయ పార్టీలు కాదు ఈ పని చేసింది.పక్క రాష్ట్రపు పార్టీ ఎంపీ .ఆమె తెరాస ఎంపీ కవిత.మహిళా పార్లమెంట్ సదస్సు కోసం అమరావతి వచ్చిన తెరాస ఎంపీ కవిత ఏమి చేశారో తెలుసా ?

ఏపీ కి ప్రత్యేక హోదా రావాల్సిందేనని తెరాస ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు.అవసరమైతే తాము కూడా ఏపీ కి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ఆమె చెప్పారు.అమరావతి వేదికగా ఆమె ఈ మాటలు చెబుతుంటే ఊహించని స్పందన కనిపించింది.ప్రత్యేక హోదా విషయంలో ఏపీ కి అండగా ఉంటామని ఆమె మీడియా ముందు చెబుతుంటే అక్కడున్న ప్రజలు కవితకి జేజేలు కొట్టడం కనిపించింది.ఈ వ్యవహారం,ఈ జేజేలు చంద్రబాబు గుండెల్లో వార్నింగ్ బెల్స్ మోగించే ఉంటాయి.