రాజు గారి నుండి ‘రతి’..!

Posted November 21, 2016

MS Raju Announced Rathi Movie Tollywoodరాజు అనగానే అందరికి దిల్ రాజు మాత్రమే గుర్తుకు వస్తాడు. అయితే దిల్ రాజు నిర్మాతగా మారకముందు తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న నిర్మాత ఎం.ఎస్ రాజు. కేవలం నిర్మాతను చూసి సినిమాకు వచ్చేలా చేసుకున్న రాజు గారు ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఈమధ్యనే తనయుడు సుమంత్ అశ్విన్ ను హీరోగా ప్రమోట్ చేశాడు. ఇక ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత రాజు నుండి ఓ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

రతి అంటూ ఓ ఎరొటిక్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు ఎం.ఎస్ రాజు. తెలుగు, తమిళ, మలయాళం, మారఠి, హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. అప్పట్లో త్రిషతో రమ్ సినిమా చేద్దామని ప్రయత్నాలు చేసిన ఎం.ఎస్ రాజు ఎందుకో వెనక్కి తగ్గాడు. ఇప్పుడు రాబోతున్న రతిని మాత్రం కచ్చితంగా తెస్తా అంటున్నాడు. టైటిల్ చూస్తుంటే కాస్త విచిత్రంగా ఉన్నా సినిమా మాత్రం గొప్పది అంటున్నాడు రాజు.

మరి చాలా రోజుల తర్వాత రాజు చేస్తున్న ఈ ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రతి అని పెట్టి కామెడీ స్టోరీ తీస్తారా రాజు గారు గొప్ప సినిమా అంటున్నారు మరి శృతిమించితే మీకున్న పాత ఇమేజ్ కాస్త ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఆ విషయం గుర్తుంచుకుంటే బెటర్ అంటున్నారు ప్రేక్షకులు.