ముద్రగడ ఆ ఒక్క డౌట్ తీర్చాలి ..

Posted November 14, 2016

mudragada padayatra and fires chandrababu
ఆధునిక రాజకీయంలో తిట్లకి,పొగడ్తలకి పౌరాణికాలు,వాటిలో పాత్రలు బాగానే పనికి వస్తున్నాయి.తాజాగా అలాంటి పోలిక ఒకటి ముందుకొచ్చింది.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని రావణాసురుడితో పోల్చారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఈ నెల 16 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర జరిపి తీరుతామని అయన స్పష్టం చేశారు.పాదయత్రకి పోలీస్ అనుమతి కావాలనడాన్ని ముద్రగడ తప్పుబట్టారు.గతంలో చంద్రబాబు ఏ అనుమతి తీసుకుని పాదయాత్ర చేశారని అయన ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు చూసి కాపులు ఆయన్ని మహానుభావుడనుకున్నారని …కానీ ఇప్పుడు రావణాసురుడుగా భావిస్తున్నారని ముద్రగడ చెప్పారు. గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలి తీసుకున్న వారిపై చర్యలు ఏవని అయన నిలదీశారు.బాబు మీద కేసెందుకు పెట్టలేదని అయన ప్రశ్నించారు.నిజమే ముద్రగడ చెప్పిన విషయాల్లో అన్నీ నిజమే కావచ్చు …కాకుంటే ఇదే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో వున్నప్పుడు ఈ ప్రశ్నలు,పోరాటాలు ఎందుకు లేవన్న డౌట్ తీర్చాల్సిన బాధ్యత మాత్రం ముద్రగడ మీద వుంది.