ముద్రగడ ది ఉద్యమమా..రాజకీయమా ?

Posted December 19, 2016

mudragada politiics or leadership
కంచాలు మోత ఏమిటి కాపుల ఆకలి గోలేమిటి అనే కదా మీ అనుమానం సింపుల్.కాపు రిజర్వేషన్ కోసం తుని ఘటన ద్వారా అమాంతం ప్రభుత్వం దృష్టిలో పడి నలుసు గా మారిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు కాపు ఆకలికేకలు,సత్యాగ్రహ యాత్ర పేరుతో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే…

తునిఘటన ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలగటం తో పాటు,ప్రభుత్వం దృష్టిలో నెగిటివ్ ఇమేజ్ ని ముద్రగడ సంపాదించుకొన్నారు అనేది నిజం వైఎస్ఆర్ పార్టీ కి విధేయుడిగా ఉన్నారనే విషయం తెలిసిందే.జాతి ప్రయోజనాల్ని కోరుకొనే నాయకుడు వివాదస్పదం గా వ్యవహరించ కూడదు సాధ్యమైనంత వరకు సంయమనాన్ని పాటిస్తూ డిమాండ్లను సాధించుకోవాలి…మొదట్లో నే ఈ కార్యక్రమాల నిర్వహణ పై ప్రభుత్వ అనుమతిని తీసుకోకుండా నాఇష్టం..నాదే నడుస్తుంది అని ఒంటెద్దు పోకడను ప్రదర్శించిన ముద్రగడ ఆ తర్వాత జరిగిన పరిణామాల రీత్యా కార్య క్రమాల నిర్వహణ కోసం అనుమతి తీసుకోవాల్సింది ఆలా కాకుండా ఇంకా మొండిగా వ్యవహరించడం వెనుక అంతరార్ధం ఏమిటి? ..విమర్శించడం కాదుకానీ తుని ఘటన జరగక ముందే ముద్రగడ కాస్త సంయమనం గా వ్యవహరించి ఉంటే ఈ సరికి కాపు రిజర్వేషన్ అంశం మీద క్లారిటీ వచ్చి ఉండేదేమో …

కానీ జరిగింది వేరు కేవలం రెండు మూడు జిల్లాల్లో తమ సామజిక వర్గం బలం గా వుంది అన్న కారణం, ప్రతిపక్షం లో ఉండటం ఈ రెండు కారణాలని వేదికలుగా మలుచుకొని జాతికి అన్యాయం చేస్తున్నారేమో అనిపిస్తోంది..ఈ రాజకీయం వెనుక నిజం గా జాతి ప్రయోజనమే ఉందా లేక రాజకీయ గుర్తింపే నా ..జాతి ఫీలింగ్ ఉంటే ఇలా వ్యవహరిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? పునరాలోచిస్తే బెటర్ ఎందుకంటె జాతి ప్రయోజనం అంటున్నారు కాబట్టి ఒక్క మెట్టు దిగితే బోలెడు ఇళ్లల్లో ..మనస్సులో ముద్రగడ వుంటారు ప్రజలా పాలిటిక్స్ ఆ అనేది ముందు ముందు తెలుస్తుంది….