బాబు పక్కనే కూర్చుంటా …ముద్రగడ

mudragada strike retirement
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ మరోసారి సీఎం చంద్రబాబు ని టార్గెట్ చేశారు. బాబుకి ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. అందులో ఈసారి అయన కాపు ఉద్యమంతో పాటు హోదా అంశాన్ని కూడా లేవనెత్తారు. హోదా కోసం బాబు నిరాహారదీక్ష చేయాలని ముద్రగడ సలహా ఇచ్చారు. అలా చేస్తే ఆయనతో పాటు అయన పక్కనే తాను కూడా దీక్షకి కూర్చుంటానని ముద్రగడ చెప్పారు. ఎందుకో తెలుసా ? అప్పుడు ఎవరు నిజంగా దీక్షలో ఎన్ని రోజులు కూర్చోగలరో తేలిపోతుందట. ముద్రగడ మరికొన్ని డైలాగ్స్ సైతం పేల్చారు. కాపు నేతలతో తనను బాబు తిట్టించడం వల్ల సిగ్గు,లజ్జ పోయాయని ముద్రగడ అన్నారు. ఇక బాబు ఏమి చేసినా కాపు జాతికోసం భరించడానికి సిద్ధంగా ఉన్నట్టు అయన స్పష్టం చేశారు.