రజినీ ఇంటి మీద పూరి గుడిసె

0
95

Posted May 17, 2017 at 12:29

muthuraman says about rajinikanthసూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ మీట్ పెద్ద చర్చనీయాంశమే అవుతోంది నిన్నట్నుంచి. తన రాజకీయ అరంగేట్రం గురించి రజినీ స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ.. అభిమానుల్ని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి పంచుకున్న కబుర్లు జనాల దృష్టిని ఆకర్షించాయి. ఈ వేడుకలో రజినీ ఆప్త మిత్రుడైన ఎస్పీ ముత్తురామన్ సూపర్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు.

సినిమాల్లోకి రావడానికి ముందు రజినీ అనేక కష్టాలు పడ్డ సంగతి తెలిసిందే. ఆయన చెన్నైలోని ఓ ఫిలిం ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది స్నేహితులతో కలిసి ఒక పూరి గుడిసెలో ఉండేవారట. సినిమాల్లో పెద్ద స్థాయికి చేరుకున్నాక కూడా రజినీ ఆ గుడిసె సంగతి మరిచిపోలేదట. చెన్నైలో తాను ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న భవనంలో పైభాగాన గుడిసె రూపంలో పెంట్ హౌస్ కట్టించారట రజినీ. ఇలా ఎందుకు అని అడిగితే.. మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని రజినీ చెప్పాడని.. దటీజ్ సూపర్ స్టార్ అని అన్నారు ముత్తురామన్.

రజినీ ఇప్పుడు కూడా ఎంతో ఇష్టంగా పూరి గుడిసెను పోలిన పెంట్ హౌస్ లో గడపడానికి చాలా ఇష్టపడతాడని ముత్తురామన్ తెలిపాడు.ఇండియాకే సూపర్స్టార్ అనిపించుకున్నా.. రజినీ ఎప్పుడూ అహంకారం దరిచేరనివ్వలేదని.. తనను కలిసిన మొదటి రోజు ఎలా ఉన్నాడో రజినీ ఇప్పుడూ అలాగే ఉన్నాడని ముత్తురామన్ అన్నారు.