సమంత, చైతూల పెళ్లి కబురు

Posted April 20, 2017 at 18:29

naga chaitanya and samantha marriage date fix
టాలీవుడ్‌ మోస్ట్‌ లవబుల్‌ జంట సమంత, నాగచైతన్యల వివాహం ఎప్పుడు అవుతుందా అని అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత జనవరిలోనే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. నిశ్చితార్థంకు ముందు నుండే వీరిద్దరు సహజీవనం సాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక వీరు పెళ్లిని ఈ సంవత్సరం చివర్లో అనుకున్నారు. ముందు నుండి చైతూ చెబుతూ వస్తున్నట్లుగా సంవత్సరం చివర్లో అంటే అక్టోబర్‌ లేదా నవంబర్‌లో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగచైతన్య, సమంతల వివాహం ఎప్పుడు అనే ఒక క్లారిటీ వచ్చింది. అక్టోబర్‌లో హిందూ మరియు క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం రెండు సార్లు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదట హిందు సాంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో వివాహం చేసుకుని, ఆ తర్వాత చెన్నైలో క్రిస్టియన్‌ పద్దతిలో వివాహం చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. అందుకు ఇరు కుటుంబాలు సైతం సమ్మతం తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. వీరి వివాహం కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.