కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మెగాడాటర్

 Posted February 11, 2017nagababu said about niharika kollywood entry

ఇప్పటివరకు మెగా కాంపౌండ్ హీరోలు మాత్రమే సినిమాల్లో నటిస్తూ  మెగా హీరోలుగా గుర్తింపుపొందారు. అయితే మెగా కాంపౌండ్ నుండి వచ్చే హీరోయిన్లు కూడా మెగా హీరోయిన్లు అనిపించుకోవాలన్న తపనతో మెగాడాటర్ నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే గ్రాండ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.  అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆమె ఫస్ట్ సినిమా ఒక మనసు డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో నిహారిక స్టార్ హీరోయిన్ల‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తుంద‌నుకొంటే సీన్ రివ‌ర్స్ అయ్యింది. దీంతో రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఆ మధ్యన హ్యాపీ జర్నీ అనే రీమేక్ సినిమాలో నిహారిక నటిస్తోందని వార్తలు కూడా వచ్చాయి.  ఇందుకు సంబంధించిన కధా చర్చలు కూడా జరిగాయి. నిహారికకు జోడీగా హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణె నటించనున్నాడన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఎందుకో ఈ సినిమా మాత్రం పట్టాలెక్కకుండా అటకెక్కింది.

ఆ  తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నిహారిక  సెకండ్ సినిమా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. అయితే అవసరాల రెండు సినిమాలతో బిజిగా ఉన్నాడు. దీంతో ఈ మెగా ప్రిన్సెన్స్ కన్ను కోలీవుడ్ పై పడింది.  ఆమె ఊహించిన విధంగానే ఆమెకు తమిళ్ లో ఆఫర్  కూడా వచ్చిందట. ఈ విషయాన్ని నిహారిక ఫాదర్ నాగబాబే వెల్లడించాడు.

కాగా తెలుగులో మొదటి సినిమాతో దెబ్బతిన్న హీరోయిన్లు చాలా మందే ఇతర భాషల్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో కూడా తమ హవా నడిపారు. మరి మెగా డాటర్ ఫేట్ ఎలా ఉందో చూడాలి.