కొడుకు సినిమాపై తండ్రి క్లారిటీ

0
93

 Posted May 5, 2017 at 13:32


అక్కినేని నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’. ఈ సినిమాను ఈనెల 19న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే సినిమా వాయిదా వేస్తున్నారని, వచ్చే నెల మొదటి వారంలో చైతూ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుందని సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చారు. దాంతో అక్కినేని ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమాను నిర్మిస్తున్న నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

చైతూ ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాకు సంబంధించి అన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే అనుకున్న డేట్‌ ప్రకారం అంటే ఈనెల 19న విడుదల చేసి తీరుతాం అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. నాగార్జున క్లారిటీతో సినీ వర్గాల్లో నిన్నటి నుండి ప్రచారం జరుగుతున్న వాయిదా వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది. రేపు అంటే మే 6న ఆడియోను నేరుగా మార్కెట్‌లోని విడుదల చేయాలని నిర్ణయించారు. నాగచైతన్యకు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా తప్పకుండా ఆకట్టుకుంటుందని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ నమ్మకంతో ఉన్నాడు.