అక్కినేని క్యాంపు లో మరో మల్టీస్టారర్..

Posted December 30, 2016

nagarjuna nikhil multistarrer movie
మనం సినిమాతో అసలుసిసలు మల్టీస్టారర్ తీసి భారీ హిట్ కొట్టిన అక్కినేని క్యాంపు మరో ప్రయత్నం చేయబోతోంది.అయితే ఈసారి తీయబోయే మల్టీస్టారర్ లో అక్కినేని ఫామిలీ నుంచి ఒక్క నాగార్జున మాత్రమే ఈ సినిమాలో ఉంటారట.ఆయనతో పాటు ఈ సినిమాలో మరో కుర్ర హీరో ఛాన్స్ కొట్టేసాడు.వరసగా వెరైటీ సినిమాలతో హిట్ లు కొడుతున్న నిఖిల్ ని ఈ అదృష్టం వరించిందట. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకుడు ..ప్రేమమ్ హిట్ తో నాగార్జున మనసు దోచిన చందు మొండేటి చెప్పిన కథ ఇద్దరు హీరోలకి భలేగా నచ్చిందట.చందు కి తొలి దర్శకత్వ అవకాశమిచ్చిన నిఖిల్ ఈ మల్టీస్టారర్ లో నటించేందుకు ఆసక్తి చూపడంతో ఈ వెరైటీ కాంబినేషన్ సెట్ అయింది.

ఇటీవల నాగార్జున కానీ నిఖిల్ గానీ కధలో కొత్తదనం ఉంటేనే ఏ సినిమాకైనా ఒప్పుకుంటున్నారు. అలాంటిది ఒకే కథతో ఈ ఇద్దర్నీ చందు ఒప్పించాడంటే అందులో గట్టి మేటర్ వుండే ఉంటుంది .అందుకే ఈ సినిమాలో నటించడానికే కాదు ..నిర్మించడానికి నాగ్ ఆసక్తి చుపిస్తున్నాడట.