నాగార్జున మెంటల్ ఎక్కించేస్తాడా..!

Posted November 17, 2016

Nagarjuna Once Again Doing Police Character.కింగ్ నాగార్జున సీనియర్ హీరోల్లో ఏ క్యారక్టర్ అయినా చేయగల సమర్ధుడు. ఇప్పటికే తనలోని ఎన్నో కోణాలను బయటపెట్టి ఆడియెన్స్ ను ఆశ్చర్యపరచాడు నాగ్. ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ సినిమా చేస్తున్న నాగార్జున ప్రేమం డైరక్టర్ చందు మొండేటితో ఓ సినిమాకు సిద్ధమవుతున్నాడు. కార్తికేయ, ప్రేమం సినిమాలతో తన ప్రతిభ కనబరిచిన చందు నాగార్జున మనసు గెలుచుకున్నాడు.

నాగ్ కోసం ఓ పవర్ ఫుల్ పోలీస్ కథ రాసుకున్నాడట. కథ నాగార్జునకు చెప్పాడట సూపర్ అనేయడంతో మిగతా పనుల్లో ఉన్నాడట. నాగార్జున పోలీస్ అనగానే శివమణి సినిమా గుర్తొస్తుంది. మెంటల్ పోలీస్ గా నాగ్ అరుపులు పెట్టించాడు నాగ్ చేసిన పోలీస్ పాత్రల్లో శివమణి బెస్ట్ చిత్రంగా నిలిచింది. అయితే మరోసారి ఆ మెంటల్ పోలీస్ ను గుర్తు చేసేలా చందు మూవీ ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

ఓ సోషల్ ప్రోబ్లంను పోలీస్ వృత్తిలో ఉండి ఎలా సాల్వ్ చేశాడు అన్న కథతో వస్తున్నాడట చందు మొండేటి. ఇక ఇదే కాకుండా ఓంకార్ తో కూడా ఓ రీమేక్ సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఓం నమో వెంకటేశాయ షూటింగ్ కంప్లీట్ అవగానే ఈ రెండు సినిమాలను స్టార్ట్ చేసేస్తాడట.