రాజుగారి గదిలో నాగార్జున రోల్ ఇదే..!!

Posted February 16, 2017

nagarjuna role in raju gari gadhi 2 movieఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత నాగార్జున రాజుగారి గది-2 సినిమాలో నటించనున్నాడన్న విషయం తెలిసిందే. రాజుగారి గదిని తెరకెక్కించిన ఓంకార్ ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. రాజుగారి గది సినిమా హిట్ అవ్వడం, నాగ్ ఈ సీక్వెల్లో నటించడంతో పాటు పీవీపీ సంస్ధ ఈ సినిమాను నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగ్ రోల్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ లుక్ లో నాగ్ కనిపించే విధంగా  ఓంకార్ ప్లాన్ చేశాడ‌ట‌.

 అతీంద్రియ శ‌క్తులున్న మెంట‌లిస్ట్ పాత్ర‌లో నాగార్జున నటించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఎదుటివారి మ‌నోభావాల‌ను తెలుసుకుని వారితో నాగ్ ఆట‌లాడ‌తాడ‌ట‌. అలాగే నాగ్ ఈ సినిమాలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కూడా వాడతాడట. కాగా నాగార్జునకి కాబోయే కోడలు సమంత ఇందులో కీ రోల్ ప్లే చేస్తుండడం విశేషం. మరి మామకోడలు కలిసి నటించబోయే ఈ సినిమాను ఓంకారన్నయ్య ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.