మరో శివలా అఖిల్ రెండో సినిమా

Posted February 1, 2017

nagarjuna says about akhil second movie as like shivaఅఖిల్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. అయితే ఆ సినిమా అంతే గ్రాండ్ గా పల్టీ కూడా కొట్టింది. దీంతో తన రెండో సినిమా విషయంలో అఖిల్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇష్క్‌, మనం, 24 వంటి సినిమాలను తెరకెక్కించి  వైవిధ్య దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె. కుమార్ పై తన రెండో సినిమా బాధ్యతను ఉంచాడు అఖిల్.

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న  ఈ సినిమా కధ ఎలా ఉండబోతోందన్న విషయం గురించి నాగార్జున నోరు విప్పారు. తన కెరీర్ లో  శివ సినిమా ఎలా మైలు రాయిలా నిలిచిందో, విక్రమ్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమా అఖిల్ కెరీర్ లో మైలు రాయి అవుతుందని వెల్లడించాడు నాగ్. తెలుగు సినిమాకి కొత్త ట్రెండ్ పరిచయం చేసే కధను విక్రమ్ తనకు వినిపించాడని, సినిమాను చూసిన అభిమానులు ఖచ్చితంగా థ్రిల్ అవుతారని చెప్పుకొచ్చాడు. తనకు కూడా సినిమాను చూడాలని చాలా ఆత్రుతగా ఉందన్నాడు.