ఈ మూవీలో వాళ్ళు ప్రాణం పోశారు.. నాగార్జున

0
104

Posted April 20, 2017 at 13:10

nagarjuna says about raarandoy veduka chuddam movieనాగార్జున… నిన్నే పెళ్ళాడతా మూవీ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు, అప్పట్లో ఈ చిత్రం ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి నాగార్జున కెరీర్ లో ఒక మంచి మైలు రాయిగా తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయింది. ఇప్పుడు అలాంటి కధాంశంతో నాగార్జున కు సోగ్గాడే చిన్నినాయనా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రా రండోయ్ వేడుక చూద్దాం’.. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని నిర్మాత నాగార్జున స్వయంగా అనౌన్స్ చేశారు.

నాగార్జున మాట్లాడుతూ ఈ మూవీ లో పనిచేసిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు ప్రాణం పోశారు.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ఎప్పుడూ ఫామ్ లోనే ఉంటాడు ఈ మూవీ కి కూడా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. టెక్నీషియన్స్ లో చాలా మంది కొత్త వాళ్లయినా చాలా ప్యాషన్ తో పని చేశారు. ఈ మూవీ లో ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ మూవీ కి ప్రాణం పోశారు.. మూవీలో ఎమోషన్స్ కనిపిస్తే.. సినిమా బాగుంటుంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో అలాంటి ఎమోషన్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి అన్నారు నాగ్.

దర్శకుడితో కలిసి రోజూ ఎడిటింగ్ రూమ్ లో కూర్చుంటున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది నాగ చైతన్య కెరీర్ కి ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది, సినిమా బాగుంది కాబట్టే ప్రెస్ మీట్ పెట్టాను. మాకు నచ్చకుండా మాత్రం మేం సినిమా రిలీజ్ చేయం. మూడో వారంలో విడుదల చేయాలని చూస్తున్నాం’ అంటూ రా రండోయ్ వేడుక చూద్దాం రిలీజ్ కి రెడీ అయిందన్నారు నాగార్జున.