లైఫ్ చేంజింగ్ మూవీ శివ.. సీక్వల్ తీస్తే అది వర్మతోనే : నాగార్జున

Posted December 20, 2016

Nagarjuna Speech At RGV Shiva To Vangaveeti Special Event

మమ్మల్ని ఏడిపించిన వర్మ ఈరోజు కాస్త ఇబ్బంది పడటం చాలా బాగుంది. ఈ సీన్ చూసేందుకు రేపు సాయంత్రం దాకా అలా కూర్చుని ఉండమన్నా ఉండే వాడిని అంటూ వర్మకు వంగవీటి ఫ్యాన్స్ వేసిన గజమాల గురించి మాట్లాడుతూ తన స్పీచ్ స్టార్ట్ చేశాడు కింగ్ నాగార్జున. అమితాబ్ బచ్చన్ రానందుకు నేను కూడా డిజప్పాయింట్ అయ్యాను కాని ఆయన ఎక్కిన ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురవడం వల్ల తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆయన క్షేమంగా ఇంటికి చేరారు అది సంతోషం. ఆయన నిండు నూరోళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నారు నాగార్జున.

స్క్రిప్ట్ రైటర్, స్టోరీ టెల్లర్, డైరక్టర్ కన్నా రాము తనకు ఓ మంచి ఫ్రెండ్ అని.. తను వర్మ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నామని అన్నారు నాగార్జున. శివ టైంలో తన మీద పెట్టుకున్న నమ్మకం వర్మకే కాదు తన కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చిందని. వోడ్కా తాగుతూ కథ చెప్పే వర్మ సినిమాలో సీన్స్ చెప్పే సమయంలో సడెన్ గా పెన్సిల్ ఉంటే దాన్ని కత్తి అనుకుని అలా పీకమీద పెట్టేవాడు. అంత ఎమోషనల్ గా కథ చెబుతాడు. అప్పటినుండి టేబుల్ కి అవతల పక్క వర్మని ఉంచి తాను కథ వినడం మొదలు పెట్టానని అన్నారు నాగార్జున. తనకు నేనోదో బ్రేక్ ఇచ్చానని చెప్పను.. తను నాకు బ్రేక్ ఇచ్చాడు నేను తనకు బ్రేక్ ఇచ్చాను అంతే. నేను కాస్త ఒంటరిగా ఉన్నప్పుడు వర్మతో చాలా విషయాలు మాట్లాడే వాడినన్న నాగార్జున తన దగ్గరకు శివ సీక్వల్ గా చాలామంది కథలు తెచ్చారని అది తీస్తే గీస్తే కనుక వర్మతోనే ఉంటుందని అన్నారు.

సరదాగా సాగిన నాగార్జున స్పీచ్ లో వర్మ స్పెషాలిటీ గురించి చెబుతూనే తను తనలానే ఉండాలని ఉంటాడని ఎవరి కోసమే ప్రామిస్ లు చేయడం బ్రేక్స్ రూల్స్ చేయడం వద్దని అన్నారు. నా ఇష్టం అని బుక్ రాసుకుని నాకే అంకితం అని ప్రపంచంలో ఎవరైనా రాసుకున్నారో లేదో కాని వర్మ మాత్రం అలా చేసి తన స్పెషాలిటీ చాటుకున్నాడని అన్నారు. శివ అనేది లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ మి అండ్ తెలుగు సినిమా.. దేశ సిని చరిత్రలో బెస్ట్ వంద సినిమాల్లో శివ ఉంటుందని అది చాలా రేర్ గా జరుగుతుందని ఇది అలానే కొనసాగుతూనే ఉంటుందని అన్నారు నాగార్జున.